చెట్ల క్రింద రాలిపడిన ఎండు పుల్లలు, కాయలు. పువ్వులు తీసుకువచ్చి అమ్మాయిల్ని సృష్టిస్తున్నాను. పక్షులు, పుల్లా పుడకా ఏరుకొచ్చి గూడు కట్టినట్లుగా నేను పుల్లా పుడకలు ఏరి ఆడపిల్లల్ని తయారు చేస్తున్నాను. ఎండిపోయిన చెట్ల భాగాల్ని వంట చెరుకుగా ఉపయోగిస్తారు. వృక్షాలలో సన్నని కొమ్మలు, పచ్చి పుల్లలు అంటే వేప పుల్లలుగా ఎండిపోతే, ఎండు పుల్లలు అంటే మంట పెట్టడానికి, టెంకాయ చెట్లు ఈ నెలను జీపురు పుల్లలుగా వాడతారు. వృక్షాలలో ఏ భాగమైనా వృధా కాదు. కాయలు ఎండిపోతే పగిలి రాలిపోతాయి. రాలినప్పుడు విత్తనాలు ఎగిరి పడటం వలన మరల మొలకెత్తటానికి అవకాశం ఉంటుంది. చెట్టు తన సంతానోత్పత్తి కోసం ప్రకృతి ఏర్పాట చేసిన వింతలు. గాలికి ఎగిరి దూరంగా పడి వానలు కురిసినప్పుడు అంకురాలు వస్తాయి. నేను రోడ్డు ప్రక్కనున్న వృక్షాల కాయల్ని ఏరుకుని తెచ్చాను.
కాయలతో అమ్మాయి ముఖాన్ని తయారు చేశాను. వంకర్లు తిరిగిన కాయల్ని తల ముంగురులుగా తీర్చి దిద్దాను. సన్న పుల్లల్ని చెవులుగా, కనుబొమ్మలుగా, ముక్కుగా తీర్చి దిద్దాను. చెవులకు అందమైన లోలాకులు డిజైన్ చేశాను. ఏ స్వర్ణకారుడు ఇంత అందమైన లోలాకులు చెయ్యలేదు ఇప్పటి వరకూ! పగిలిన కాయలు లోపలి డిజైన్ అద్భుతంగా ఉన్నది. కళ్ళ కోసం చక్కని ఎండు కాయలు పెట్టాను. మీనాల్లాంటి కళ్ళు అంటే అర్ధం సరిపోయిందనుకుంటాను. గౌను డిజైన్ కూడా బాగా చేశాను. ఫ్యాషన్ ప్రపంచంలో బెస్ట్ డిజైనర్‌గా రీతూ కుమార్‌కు ఇచ్చినట్లుగా నాక్కూడా అవార్డు ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. నోరు, పళ్ళు కూడా బాగున్నాయి కదా!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి