హేమంత ఋతువు ఒక మహాక్రతువు
ప్రతి జీవికి జీవం జీవితం. ప్రతి జీవికి ఓ కొత్త జత.
హేమంత ఋతువు ఒక శాంతం- ఒక శక్తివంతం.
వనమే దానికి స్పందన ప్రతిస్పందన.
సీతాకో చిలుకలు
రామచిలుకల ప్రాతఃకాల ప్రార్థనలు
ఉదయ సంధ్యల దేహాల అభ్యంగన స్నానాలు.
ఎగిరే మేఘం
వీచే గాలి
కురిసే వాన
పారే నీరు
ఆది అంతం లేని ఒక ఋతు చక్రం.
కొత్త పాత ఆకులు
లేలేత చిగుళ్ళు
ఎండా వాన
చీకటి వెలుగు
ఉరుము మెరుపు
ఓ కొత్త లోకం ఓ కొత్త ఆకాశం
ఓ కొత్త ఇంద్ర ధనుస్సు.
రంగురంగుల పూలు
రంగురంగుల ఆకులు
రంగురంగుల పూతలు
రంగురంగుల కాయలు
రంగురంగుల ఫలాలు.
లేళ్లు జింకలు
కుందేళ్లు నెమళ్లు
పాలు నీళ్ళలా కలిసే
నింగి నేలా మురిసే
కోయిలా -జలపాతం
నదీ- మదీ
కిరణం-స్వరం
సర్వస్వం ఒక రాగం అయింది
ఆగింది అడవిలా
మిగిలింది చిగురులా
రాలింది పండుటాకులా
కాసింది పిందెలా
శత్రువు కాదు అది
అది హేమంత ఋతువు
ప్రకృతి ప్రసాదించిన
బంగారు ధ్రువపత్రం అది.
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి