సుప్రభాత కవిత : - బృంద


చీకటి మూసిన ఆకాశంలో 
చిరు చుక్కల  మెరుపుల్లో 
రేపటి కోసం వేచే కన్నుల 
రెప్పలు దాచిన స్వప్నాలు

కొండంత దిగులైనా 
కొంచెమే అవకపోవునా?
కమ్మిన కలతల మేఘం 
కదలక అక్కడే నిలిచేనా?

ఏదొచ్చినా  ఎదురెళ్ళి 
ఏమైనా భరించాలి 
ఏదీ నిలవదు నీతోనే 
ఏడుపైనా నవ్వైనా..!

గడియారం మనదైతే 
కాలం మనదౌనా....
గ్రహచారం  మనదైతే 
ఫలితం మరొకరిదౌనా?

ముళ్ళుంటే దారంతా 
ఏరివేస్తూ కూచుంటామా 
కాళ్లకు చెప్పులు వేసుకుని 
జరిపేస్తూ కదిలిపోమా?

నీకని  ఉంచినది ఏదైనా 
నీ దరికి వచ్చి చేరు!
నీది కానిది అందినా..
అది చేయి జారేతీరు...

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు