మా ఇంటి మందారాలు: - కవి మిత్ర, సాహిత్య రత్న -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా

 మన ఇంట్లో మందారాలు పూసాయని
మనుమడు మాధవుడు చెబితే 
మిస్సోరి అమెరికాలోని సెయింట్ లూయిస్ లో ఉన్న 
మాలతమ్మ మడిగా తలుపు తీసుకుని డెక్కు మీదకు వచ్చి 
ముచ్చటగా కొన్న కుండీలో ఉన్న ఎర్ర మందారాలను 
మురిపంగా కోసి 
మహాలక్ష్మి పూజ భక్తి శ్రద్ధలతో చేసి 
మళ్ళీ రేపు నాలుగు మందారాలు పూస్తాయి పూజకి పనికివస్తాయని 
పేరు తెలియని ఇంగ్లీష్ పువ్వులబాధ తప్పింది 
నా పూజ ఫలించింది అన్న  మాట విని సాఫ్ట్వేర్ కొడుకు మహేష్ మనసులోనే నవ్వుకున్నాడు.....!!
..............................
కామెంట్‌లు