సామెత -255: ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం వుండదు
***
ఏమెండలు ఏమెండలే అవ్వా! శితం ఎండలు వడదెబ్బల్తో పానాలు తీత్తున్నయి. గిట్లయితె ఎట్ల బత్కాలె. గీ ఎండల్కి మడుసులు పిట్టలు రాల్నట్టు రాల్తుండ్రు. గీ త్యేప ఎండ యేడి యాబై డిగిరీల కానికొచ్చిందంటగా అవ్వా! ఎవ్వలి నోట్ల సూడు గిదే మాట."
"అవును తమ్మీ! గీ త్యేప రోయిని కార్తెకి రోళ్ళు పలిగే ఎండ గొట్టింది. టీవీలల్ల,రేడియాల ఒకటే శెప్పుడు. పొద్దుగాల పదిగొట్టిన కానించి పొద్దుమీకి అయిదు గొట్టే దనుక బయిటికెళ్ళకుండ్రి" అని.
అవును గని అవ్వా! గా సయిమంలనే గద ఎగసాయం పన్లు ఉండేది. ఇంట్లె పెంట గడ్డలున్న పెంట పొలాలకి దోలాల్నా. ఇంగొచ్చే ఆనల కోస్రం పొలాలు శెల్కలు దున్ని పెట్టుకోవాల్నా! ఎన్నుంటయవ్వా పన్లు.సర్కారోల్లేమో బయిటికి పోకుండ్రి అనబట్టిరి.పోకుంటెట్లయితదవ్వా! "
"అన్నట్టవ్వా ! గీ త్యేప ఆనలు సరింగ రావు గదేదో ఎలునీను వొచ్చిందంటగా!"
అవునంట తమ్మీ! గా ఎలెనీనో వల్ల పంటలు పండే తాన ఆనలు కుర్వవంట.ఎడారుల్లనేమో వర్దలు పార్తయంట " ఏందో మడుసులు సేశినా పాపాలకి గా ఆన దేవుడు పెడ్తున్న శాపాలేమో అనిపిత్తున్నది."
వామ్మో! మన మడుసులు గంతగనం ఏం పాపాలు సేశిండ్రవ్వా?"
"శిన్నగంటవేర తమ్మీ! ఒకటా రొండా సేశింది. పచ్చని శెట్లన్ని తొవ్వలు ఎలడుపు శేయాలని నరికిరి. అడువులన్ని ఇండ్ల జాగల పేర్లతో పొతం బెట్టిరి. పచ్చగున్న బూతల్లిని అగ్గి గుండం జేసి దూపార్తికి అల్లాడి పోయేటట్లు సేశిరి.గియ్యన్ని పాపాలు కావార తమ్మీ!"
గంద్కనే సూశినవా! ఆనా కాలంల ఎండే,సలికాలంల ఎండే,ఎండా కాలంల ఎండే... ముక్కారు కాలాలల్ల ఎండలు గొట్టుడేనాయె."
"గంద్కనే ఆన దేవుడు ఎన్కపట్టు బట్టిండు, సూరయ్య ఉగ్గర నరసింవుడోలే మండబట్టిండు. గయ్యన్ని మనకి శాపాలేగా తమ్మీ!"
"అవునవ్వా!గియ్యన్ని శెప్తుంటే ఎన్నులోంచి వొణుకొత్తున్నది. ఇంగెట్ల మా ఎగుసాయం జేసే రైతుల పరిత్తితి ఎట్లవ్వా? ఎట్ల బచాయించాలె? "
గంత బుగులు శేయకు తమ్మీ !రుతు పవనాలంటే మనేపు వొత్తానికి పయానమైనవంట. గయ్యి సరింగ తొవ్వ మర్వకుండ మనేపు వొత్తె ఆరుదుర కార్తె తల్లి కర్నిచ్చినట్టె.గా తల్లి కర్నిత్తే ఎగసాయాన్ని నమ్ముకున్నోళ్ళ దరిద్రెం తీర్తది.గా మంచి దినాలు రావల్ల్నని మొక్కుకుందం.
గంతే అవ్వా!గంతకన్న మనమేం కోర్కుంటం."
అవును తమ్మీ! "ఆరుద్ర కర్ణిత్తే దరిద్రం వుండదని" మన పెద్దోళ్ళు ఊకెనే అన్లే. "ఆరుద్ర కురవాలెఁ పంటల్లు పండాలె రైతన్న ఎతలన్ని తీరాలె-అమ్మ నేలతల్లి సంబుర పడాలె."
"గియ్యన్ని సైన్మా దీశి సూపినట్టు శెప్పినవ్ అవ్వా!"
గీ ఆనా కాలంల తొవ్వల పొంటి గట్లెంబటి,కాళీ తలాలల్ల గా వొనజీవి రామయ్యొతికె మొక్కలు నాట్త. నా దోత్తుగాళ్ళకి సుత శెప్పి నాటిత్త."
"గట్లన్నవ్ మంచిగుంది తమ్మీ! గిట్ల అందరు తల్సుకొని శేత్తే ఆరుద్ర కార్తె తల్లే గాదు అన్ని కార్తెల తల్లులు సుత మనల్ని కరునిత్తరు."
గింత ఎండల సుత మీ యిల్లు సుట్టూతల శెట్లుండబట్టి సల్లగ పానానికి ఆయిగుంది. ముందుగాల మా ఇండ్ల కానించే మొదల్బెడతం అవ్వా!"
"అయితే! గీ యిత్తనాలు దీస్కబో తమ్మీ మనం శెట్లని బతికిత్తే గయ్యి ఆనలు కురిపిచ్చి మనల్ని బతికిత్తయి."
గదండీ సంగతి" ఆరుద్ర కార్తె అంటేనే మాంచి ఆనా కాలం. గీ సయిమంల ఆనలు రైతులకు మంచి జేత్తయి.గందుకే "ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం వుండదు" అనే సామెత పుట్టింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి