చదవడానికి వచ్చానండి...అని అనగానే ఆక్కడి లైబ్రేరియన్ "ఈ గ్రంథాలయం మీ కోసం కాదు..." అని చెప్పారనుకుందాం... అప్పుడు ఎంతగా బాధపడతాం.... సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది ఒకరికి. అతని పేరు ఆస్కార్ సిమన్స్.
అతనొక నల్లజాతి పౌరుడు.
అతను ఒక గ్రంథాలయాన్ని స్థాపించడం వెనుక ఓ కథ ఉంది. అతను పారిశుధ్య కార్మికుడు. అతని గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
అది దక్షిణ కరోలినా. 1941వ సంవత్సరం. అక్కడొక పబ్లిక్ లైబ్రరీ ఉంది. పేరుకే పబ్లిక్ లైబ్రరీ తప్ప అక్కడ శ్వేతజాతీయులకు మాత్రమే అనుమతి ఉండేది. నల్లజాతీయులను లోపలికి రానిచ్చేవారు కాదు. ఆస్కార్ సిమన్స్ ఈ విషయం తెలియక పుస్తకం చదువుదామని వెళ్తే అక్కడి లైబ్రేరియన్ మీలాంటివాళ్ళు ఇక్కడ చదవటానికి వీల్లేదు అని పంపించేశాడు. అయితే అతను అదే లైబ్రరీలో పని చేసేవాడు. అతను ప్రతి రాత్రి ఆ గ్రంథాలయాన్ని శుభ్రంగా ఉంచేవాడు. నేలను తుడిచేవాడు. చెత్తను ఊడ్చేవాడు. బల్లలను శుభ్రం చేసేవాడు. పుస్తకాలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. అందువల్ల అతను ఏం చేశాడంటే ఎవరికీ తెలీకుండా ప్రతి రాత్రి, అతను ఒక పుస్తకాన్ని ఇంటికి తీసుకువెళ్ళేవాడు. తన షెడ్డులో టార్చ్‌లైట్ వెలుగులో దాన్ని చదివేవాడు. మరుసటి రోజు ఉదయం ఎవరికీ తెలీకుండా లైబ్రరీలో పెట్టేసేవాడు. అతను 12 సంవత్సరాల పాటు ఇలా చేశాడు. ఈ క్రమంలో అతను 400 పుస్తకాలు చదివాడు.
1953లో, అతను పదవీ విరమణ చేశాడు. అతను 300 డాలర్లు పొదుపు చేశాడు.
అతను తన గుడిసె బయట ఒక చిన్న చెక్క అరను ఏర్పాటు చేశాడు. అందులో 20 పుస్తకాలు పెట్టాడు. ఒక పలక మీద ఇలా రాసాడు..."ఒకటి తీసుకోండి. తిరిగి ఇవ్వండి. పుస్తకం చదవండి. చదివించండి"
ఈ విషయం తెలిసి శ్వేతజాతీయులైన ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. ఓ అధికారి వచ్చి ఆస్కార్ ని నిలదీశాడు. అయితే ఆస్కార్ బెదరలేదు. తాను సొంతంగా ఓ షెల్ఫ్ పెట్టకూడదని ఏ చట్టమూ లేదని, తానేమీ కాని పని చెయ్యడం లేదని
ఆస్కార్ అన్నాడు. దాంతో ఆ అధికారి వెళ్ళిపోయాడు.
ఒక సంవత్సరంలోపే, అతను దాదాపు రెండు వందల పుస్తకాలు చేర్చాడు. 5 సంవత్సరాలలో, ఈ సంఖ్య ఎనిమిది వందలకు చేరింది. ఆస్కార్ స్థాపించిన లైబ్రరీ విషయం తెలిసి సమీపాన ఉన్న
మూడు జిల్లాల నుండి పుస్తకప్రియులు ఆస్కార్ లైబ్రరీకి రావడం మొదలుపెట్టారు. వారిలో నల్లవారు, తెల్లవారు, ధనవంతులు, పేదవారు ఇలా అందరూ ఉండేవారు. వచ్చిన వారందరితోనూ పుస్తకాలు చదివించాడు. పుస్తకాలు తీసుకునేవారు. పుస్తకాలు చదివారు. తిరిగీ ఇచ్చేసేవారు.
1971లో ఆస్కార్ మరణించాడు. అయితే విచిత్రమేమిటంటే, అతను పెట్టిన తొలి షెల్ఫ్ ఇప్పటికీ అక్కడ అతని గుర్తుగా పదిలంగా ఉంచారు. కొందరు పెద్దలు కలిసి ఇప్పుడు దాని పక్కన ఒక భవనం.నిర్మించి దానికి "ఆస్కార్ సిమన్స్ ఉచిత గ్రంథాలయం" అని పేరుపెట్టారు. లోపలికి వెళ్ళడానికి ఎలాంటి కార్డూ అవసరం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నావు... నువ్వేం చేస్తుంటావు వంటి ప్రశ్నలు అడగరు.
ఆ బోర్డు మీద ఇప్పటికీ ఇలా రాసి ఉంటుంది: "ఒకటి తీసుకోండి. తిరిగి ఇవ్వండి. పుస్తకం చదవండి. చదివించండి"
ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన అసలు వ్యక్తి పారిశుధ్య కార్మికుడు.
కొన్ని భవనాలు ఇటుకలతో నిర్మింపబడతాయి. కొన్ని మొండి పట్టుదలతో, ప్రేమతో నిర్మింపబడ తాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి