నిలువెత్తు సాక్ష్యం: - - మాణిక్యాలరావు పంచదార్ల
ప్రాకులాటను విడిచేసి,
సంతృప్తిని వెతుక్కుంటూ
పైకి ఎగబాకుతున్న ప్రతి
అడుగులోనూ...
హృదయం అడుగుతుంది.

"తొలి నాటి నిరాశను
 గెలిచావా?" అని!
​స్వార్థంతో ముడివేసుకున్న
కొన్ని భ్రమలను వీడేయడమంటే...
నిజాల అద్దంలో
మనల్ని మనం చూసుకోవడమే!

​ఆశలు రేకెత్తుతూనే ఉంటాయి,
వాటిని సంపూర్ణంగా హద్దుల్లో 
ఉంచలేము.

కానీ, మనసే సూత్రధారిగా
ఆలోచనల్ని పదునుగా ఉంచితే,
విజయం ఎన్నటికీ నీకు దూరం అవ్వదు!

కామెంట్‌లు
Popular posts