తొలిలో ఉంది ఉత్సాహం: - డా.సి. వసుంధర చెన్నై
ప్రకృతికి మనిషికి ఉంది  సంబంధం.
ప్రకృతి పచ్చగా ఉంటేనే మనిషికి  మనుగడ

మానవ జీవిత మనోజ్ఞతకు సాగరాలు,మహిజాలు ముఖ్య సాధనాలు. 

సూర్యుడు తన కిరణ  చేంతాడు తో వాతావరణ పాత్రను బిగించి 
సాగర జలాల
నబ్రవీధికెక్కింపకపోతే 
తొలకరి చినుకులు 
తొంగిచూచునా?

ఇచ్చిపుచ్చుకోవటాలు అభ్యుదయానికి మంచి నెరవు.(ఉపాయం)
మనం ప్రకృతిని కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది. 

పృథ్విలోఅద్రి(చెట్టు) ప్రాణవాయువు
నందించే దేవత.
దాని తల నరికితే 
మనిషికి మిగిలేది నరకమే. 

తొలకరి చినుకు పడాలంటే పచ్చదనంఈటారకుండా మసులకో.

గెలకబోకు సాగరాలను.
నాగరికత పేరుతో ప్రకృతికి క్యాన్సర్ రానీయకు. 
నీవు తీసుకునే జాగ్రత్తలే నిన్ను తొలకరి చినుకు 
పులకరింప చేస్తుంది. 
అన్నం పెట్టే రైతన్నలకు తొలకరి చినుకు 
తొలి దేవత.
మండేఎండకు
గుండెలవిసిపోయిన భూమాత పు లకరించేది తొలకరి చినుకుకే.
ఏండిన మట్టి గుండెలపై చినుకు చినుకు పడుతూ ఉంటే 
చెప్పరానిఆ ఆనందం గుప్పున వచ్చే మట్టి వాసన 
ఓహో ఏమని వర్ణించగలను. 
తొలకరిచినుకు  తడిసి చూడు.
దక్కును నీకుమరో లోకపు 
ఆనందాల జల్లు

కామెంట్‌లు