అభిమన్యుని మరణానికి ధర్మరాజును నిందించుట-306 వ రోజు
రణరంగమున పడిఉన్న నాకుమారుడి మోము ఉదయించిన చంద్రుని వలె ఉందేమో? ప్రాణం కంటే మిన్నగా చూసుకొనే సుభద్ర తన కొడుకు మరణాన్ని తట్టుకొనగలదా! కుమారుని కొరకు తపించే ద్రౌపది శోకం ఎవరు మాన్పగలరు?" అని పరి పరి విధముల పరితపిస్తూ ధర్మరాజు ముఖము చూసి " ధర్మరాజా ! నేను సంశక్తులతో పోరుతున్నప్పుడు కౌరవవీరుల సింహనాదం విన్నాను. యుయుత్సుడు ఎలుగెత్తి అన్న మాటలు విన్నాను. " మీరు అభిమన్యుడితో పోరాడలేక బాలుడైన అభిమన్యుని పలువురు చేరి చంపారు. ఇప్పుడు మీకు సంతోషం కలిగిందా ! అర్జునుడికి, కృష్ణుడికి అపకారం చేసి బతుకగలరా ! ఈ దుష్కార్యం వలన కలిగిన పాపాం వారిని దహించక ఉంటుందా? " అని పలికిన యుయుత్సుని మాటలు నేను చెవులారా విన్నాను. నేను కృష్ణుడు ఆ మాటలు విని కూడా నమ్మలేదు. ధర్మజా ! తగిన సమయంలో నాకు తెలిపిన నేను అభిమన్యుని చుట్టుముట్టిన వారిని ఎదిరించి అభిమన్యుని రక్షించుకునే వాడిని కదా ! అని విలపిస్తున్న అర్జునుడిని, శ్రీకృష్ణుడు పొదివి పట్టుకుని " అర్జునా ! ఏమిటీ వెర్రి ! రణరంగమున యోధులకు మరణం సహజము కదా! నీ కుమారుడు అభిమన్యుడు ఒంటరిగా అనేక మంది కౌరవ యోధులను వీరోచితంగా ఎదుర్కొని మరణించినందుకు సంతోషించక దుఃఖించుట తగునా! తెలుకొనతగిన విద్యను తెలుసుకున్న జ్ఞానివి. నీ వారంతా ఎలా శోకిస్తున్నారో చూడు నీవిలా దుఃఖిస్తుంటే వారిని ఓదార్చేదెవరు " అన్నాడు. అర్జునుడు " నాకుమారుడైన అభిమన్యుని చంపిన వారెవరు. నేను వెంటనే వారినందరిని సంహరిస్తాను. ఈ రోజు యుద్ధం ఎలా జరిగిందో వివరించండి. ఇంత మంది అస్త్రకోవిదులు, మహావీరులు ఉండగా అభిమన్యుని ఇలా దారుణంగా చంపుటకు వారికి ఎలా సాధ్యమైంది. ధర్మజా ! మిమ్ము పాంచాలురను నమ్మి ఇలా మోసపోయాను. మీకు నా కుమారుని రక్షించు శౌర్యం లేదని తెలిసీ నేనే వచ్చి నా కుమారుని కాపాడలేక పోయాను. ఇంతకూ అభిమన్యుని వెన్నంటకుండా మిమ్ము అడ్డగించిన దెవరు ? అయినా మీకు అంతటి ధైర్య సాహసములు ఏవి ? ఇందరు ఉండీ ఒక్కడిని రక్షించ లేక పోయారు. మీరంతా బలహీనులు యుద్ధానికి పనికి వారు అని తెలిసీ మిమ్మలిని నమ్మి నా కుమారుని మీకు వదిలి పోగొట్టుకున్నందుకు నన్ను నేనే నిందించుకోవాలి. మిమ్ము అని ప్రయోజనము ఏమి పైకి శూరుల వలె కనపడుచున్నా మీ ఆయుధములు కేవలం అలంకార ప్రాయమే కాదా! కాకున్న నాకుమారుని రక్షించరా ! " అని అర్జునుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అక్కడ ఉన్న రాజులకు అర్జునుడితో మాట్లాడే ధైర్యము చాల లేదు. కృష్ణుడు మాత్రమే అర్జునుడిని అనునయిస్తున్నాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి