బడి పిలుపు : -ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)-సారవకోట
బడి పిలుపు
తెరుచుకుంది తలుపు..
సంచులు దులుపు..

ఆడుకున్న అరుగులు..
బయట తిరుగులు..
పెట్టిన పరుగులు..

ఇవన్నీ వదులు..
చదువుకు కదులు..
సిద్ధమైనాయి తరగతి గదులు..

జ్ఞానానికి నెలవు..
పుస్తకాలు కలవు..
కాలక్షేపాలకు శెలవు..

చదువుల కొలువు
సంస్కారంతో నిలువు..
అందరి మనసులు గెలువు..

గురువుల విధులు..
బడులు జ్ఞాన నిధులు..
ఆనందాలకు లేవు అవధులు..


కామెంట్‌లు