పట్టుకొమ్మలు...!!: - యెనుముల వేణుగోపాలరావు. - అమలాపురం.
 మన పల్లెటూర్లు 
పచ్చదనానికి పట్టుకొమ్మలు ,
సంస్కృతి,సంప్రదాయాలకు 
ఆనవాళ్లు,
మంచితనానికి _
నిలువెత్తు నిదర్శనాలు,
మమతానురాగాలకు మారుపేర్లు,
ప్రేమాభిమానాలకు 
నిలయాలు !
ఇక్కడ ఎవరినీ 
పేరుపెట్టి పిలవరు !
అన్నా,తమ్ముడూ,అక్కా,వదినా,
అత్తా,మావయ్యా,బాబాయి _
పిన్ని ,
తాతయ్యా , మామ్మ, బావ ,మరదలు ,
ఇలా బంధుత్వ వరసలతోనే పిలుస్తారు !
ఇక్కడ గాలి స్వచ్ఛం ,
మనుషుల మనస్సులు స్వచ్ఛం !
ఇక్కడ మనుషులకు 
కల్మషాలు ఉండవు !
కులమతభేదాల 
జాడలు కానరావు !
అంతా ఒక్కటే అన్న భావంతో మెలుగుతారు ! 
స్నేహానికి ప్రాణం ఇస్తారు ,
త్యాగానికి సైతం వెనుకాడరు !
ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు !
అందుకే కన్నతల్లిని , 
ఉన్న పల్లెటూరిని మరువరాదంటారు పెద్దలు !
పెద్దలమాటలు ,సద్దన్నo మూటలుకదా !!
             ***

కామెంట్‌లు