ఇచ్చిన వాడు దాత - ఇవ్వని వాడు రోత
***
"నువ్వెన్నను అవ్వా! కొంతమందిరి ఉంటరు సూశినావ్.గాళ్ళది గాళ్ళకే చెల్తది. ఇంకోళ్ళతో పోల్సుడే ఉండదు. మడిషంటే గట్లుండాలె. ఇంకొందరైతే నోరు గట్టుకొని సంపాయిచ్చుడే గని ఎంగిలి శేతైన కాకిని ఎన్నడన్న గొట్టంగ సూశినాం."
"ఏంది శెల్లోవ్! గియ్యాల కొత్త కొత్త ముచ్చెట్లు శెప్పవడ్తివి. గియ్యాల నీ మన్సు మడుసుల పోకడ మీద పొయ్యిందేంది?"
"అవునవ్వా! కొంతమందిర్ని సూత్తె శెయ్యెత్తి మొక్కాలనిపిత్తది. ఇంగ కొంత మందిర్ని సూత్తెనైతే థూ! గా జల్మలు పాడుగాను ఎందుకు పుట్టిర్రో ఏం గట్టుక పోతరో అనిపిత్తదవ్వా!"
"ఏం జర్గింది శెల్లె! గాల్లెవల్నో మాటల్తో మోత్తున్నవ్. పడేత్తున్నవ్.ఇంతకీ ఎవలాళ్ళు ?
"గదేనవ్వా మొన్న సింగమ్మత్త బిడ్డ నీళ్ళాడ్డానికి వొచ్చింది గద.గా పొల్ల ఆపతి బడ్తుంటే దవాఖానాకి దోల్కబోయిండ్రు. గా దవాఖానోళ్ళు పదేలు గడ్తెనే సూత్తం ముందుగాల పైసలు తేండ్రి అన్నరంట. శేతులొక్క పైస లేక గిలగిల్లాడ్తుంటే నాతాన పాలమ్మిన పైసలు రెండేలుంటే ఇచ్చిన. గట్లనే పక్కనింట్లె వున్న పాపయ్యని అడ్గితే నా తానేడున్నయి పోండ్రి పోండ్రి అనుడే గాదు"బడే బాద్దరోల్లె నేనిక్కడ మీ కోసం ముల్లెగట్టి దాశిన్నని వొచ్చినారు" అన్కుంట తిట్టిండంట. గీళ్ళకి మొకం గొట్టేశినట్లయిందట. అత్త నా తానికొచ్చి శేతులు బట్కొని గాయనన్న మాటలు జెప్పి ఒకటే ఏడ్సుడు.
" పొల్ల నీళ్ళాడ్డానికి వొచ్చింది గద.ముందుగాల జాగర్త పడాలిగద శెల్లె! గట్లెట్ల శేతుల పైసల్ లేకుండ జేస్కుర్రు."
దాశిర్రట అవ్వా! పొల్లని ఆరం దినాల కింద దవాఖానకి బోయి సూపిత్తే వొచ్చే నెలలో కాన్పయితదని శెప్పిండ్రంట. గా దాశిన పైసలు మందుకట్టలు యిత్తనాలకు కర్సు బెట్టిర్రట.మావఁకి వొచ్చే నెలలో యవలో ఇచ్చేటియి ఉన్నయని దైర్నంగ ఉండటవ్వా!"
"అయ్యో! గట్లనా శెల్లె!మనసుమంటోళ్ళ రైతులింట్లె పైసలు గిట్ల ఏదొక అవుసరానికి కర్సయి పోతనే వుంటయి శెల్లె!"
"మన దానయ్య పెదబాపును అడ్గి సూడమను.గా పెదబాపు శానా శానా మంచోడు.గింత ఆపతి వుందంటే అస్సలూకోడు.శేతనైన సాయం జేత్తడు."
"అవునవ్వా! మొదట్ల యాదికి రాలె. ఆటెంక యాదికి రాంగనే గా పెదబాపు ముచ్చెటి శెప్పిన. నన్ను సుత రమ్మండ్రు.ఎల్లిన.యిష్యం జెప్పంగనే ముందుగాల దవాఖానాలో ఎవలో తెల్శినాయన ఉండంట.గాయినకి పోనుగొట్టి పొల్లకేమన్నైతే మాత్తరం ఊకోను.ముందుగాల వైజ్గం మొదలు వెట్టుండ్రి.పైసలు పంపుత గని అన్నడు. గిస్మంటి సయిమంల కోడలు కన్న నువ్వు దగ్గరుండాలె,పైసల సంగతి నేను జూస్కుంట ఎల్లుమని పంపిండవ్వా!"
"గింతకీ! గా పొల్ల ఎట్లుంది శెల్లె.ఆపతి నుంచి బయిట బడ్డదా?"
"పడుడే గాదవ్వా! పెద్దాప్రీషను జేసిండ్రు. పండంటి బిడ్డ పుట్టింది. తల్లీ పిల్ల మంచిగుండ్రు. కర్సంత దానయ్య పెదబాపే పెట్టిండవ్వా! పైసలుండంగనే ఏం లాబమవ్వా గట్ల సాయం జేసే మన్సుండాలె గని. గా పాపయ్యకి కట్టెల బదులు కట్టలతో కాల్శేన్ని డబ్బుల కట్టలున్నయి. పిల్లికి బిచ్చం బెట్టడు. మల్ల శెవాల మీద ఏశిన పైసల్ని సుత ఎవలు సూడకుండ కీసలేసుకునే రకం.గదో జన్మ గాయినో మడిషా అవ్వా! గంత రోత మడిషిని ఏడ సూల్లేదవ్వా!"
గందుకే శెల్లే మన పెదబాపు లెక్క "ఇచ్చినోడు దాత- ఇయ్యనోడు రోత" అని ఊకెనే అన్లే మన పెద్దోళ్ళు. గిస్మంటోళ్ళని జూసే గట్లాంటి సామెత బుట్టింది శెల్లే!"
"అవునవ్వా! నిజ్జంగా గా పెదబాపు - గా పక్కింటాయిన గీ సామెతకి సరిగ్గ సరిపోతరు."
గదండీ సంగతి! ఇచ్చిన వాడు దాత -ఇవ్వని వాడు రోత " అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి