గానపానం: -డా.సి.వసుంధర
పాట.
       🦋

కొత్త రాగమేదో
నా గళములో
యుగయుగాల
అనురాగమునేడే
కురిపించేనే
మాధవా! 

నీ ప్రేమ సుధారస
వాహినిలో
కామరహితనై
జలకములాడి న జన్మ తరించేను
జనార్ధనా!

 
ఎందుకు నే,
నీ గో సంపదలో
గోవై పుట్టక పోతినయా/.

చెట్టునో, ఏటి  గట్టునో,
నీవు తిరుగాడే
నేలపై మట్టినో, అయి
పుట్టక, ఇటు పుట్టితి నేలో యదునందనా!

నీ పుట్టువులో గుట్టు నెరుగక
గోపబాలుడవని
 భ్రమసితిరా!
మాభ్రమలను పోకార్చ ప్రకృతితో
కలిసి కనుపించే
కృష్ణావతారా,లీలా
మోహనా మురళిలోలా!

నమ్మిన వారికి
సొమ్మువు నీవు
నా మనవనమ్మున ఝంమని
పాడే తుమ్మెద నీవు.
నీ గానములోపరవశమంది
నీ పదములపైవ్రాలిపోదునా!
ఇమిడిఉందునా 
కదిలే నీ అడుగుల సవ్వడి నేనై.

కామెంట్‌లు