సీత రాముల వివాహముల నొన్నర్చుటకు నిశ్చయించుట
జనక మహారాజు వంశము గూర్చి తెలిపినాక 
వశిష్ట విశ్వామిత్రులు చాలా సంతోషపడి 
మీ ఇరువంశాలు చాలా పేరుగాంచినవి 
మీ వంశ సంబంధాలు చాలా బాగుంటాయి
  
సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు 
వారు ఒకరికొకరు తగిన వారు
నీసోదరుని బిడ్డలు మాండవీ,శృతికీర్తనలను 
భరతశత్రజ్ఞులకిచ్చి వివాహము జరుపుము 

విశ్వామిత్రుని మాటలువిని జనకమహారాజు 
మా ఇరువురి వంశాల వివాహ బంధాలు 
చాలా గొప్పవని శుభవార్త తెలిపితిరని 
మహార్షులకు జనకుడు అంజలి ఘటించాడు 

ఇక్ష్వాకవంశ నలుగురు రాకుమారులకు
మీ నలుగురి పుత్రికలకు వివాహము
ఒకే శుభసమయమున జరుగును 
ఆ శుభ ఘడియలు మేము తెలిపేదము 

ఓ బ్రహ్మర్షి నేడు మఖా నక్షత్రం 
రేపు పుబ్బ నక్షత్రం వినుమయ్యా
ఎల్లుండి ఉత్తర నక్షత్ర సమయమున 
వారివివాహానికి శుభ ఘడియ తెలిపినారు.


కామెంట్‌లు