ఫాదర్స్ డే. : - డా ప్రతాప్ కౌటిళ్యా.

ఏ కొడుకు అయినా- తండ్రి పేరును 
ప్రపంచానికి పరిచయం చేస్తాడని-
అతడు ఒక సూర్యుడు 
అతడు ఒక చంద్రుడని -తండ్రి చెప్తాడు.

కానీ 
తండ్రి ఒక యజమాని కాదు నిజమని 
తండ్రి ఒక భౌతిక నియమం అని 
నియమం తప్పకుండానే సూర్యుని చుట్టూ 
భూమి 
భూమి చుట్టూ చంద్రుడు 
తిరుగుతున్నాడని-ఏమాత్రం తేడా వచ్చినా 
సూర్య కుటుంబమే ఉండదని 
తేల్చి చెప్పకనే చెప్పినవాడు ఒక్కడే అతడే నాన్న. 
==================================

డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు