సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

  •  సామెత -265: ఇంటి కూటికీ బంతి కూటికీ రెంటికీ చెడినట్లు"
**
"ఏందో అవ్వా! గా బూకరి మావఁని సూత్తుంటే నాకనిపిత్తది గామవసలు తినడాన్కే పుట్టిండా ఏంది? ఎంచేపు తిండి యావే తప్పిడిశి ఇంగేం జ్యాస ఉండదా?ఏం మడిషో ఏమో? "
 "ఎవలు శెల్లె! గా బాన కడ్పు బాలయ్య మావఁ ముచ్చెటినేనా నువ్వు శెప్పేది."
 "గా మావఁ  ముచ్చెటినే అవ్వా !తింటె తిన్నడు గనవ్వా. ఎన్క ముందు సూసుడనేదే లేదు వుండేందు. గా మావఁని నవ్వుతాలుకు పిల్శినా , అసలు పిల్వకపోయినా నట్టమేం లేదు.కాక్కాలుతో కబురు శేత్తె సాలు ,ఉరుకొత్తనే ఉంటడవ్వ."
 ఊల్లె పెండ్లిల్లయినా,పేరంటాలైనా,సావులైనా తద్దినాలైనా ఈగొతికె బలే ఆల్తడు.దొంగల ఆసన బట్టి పట్కొనే కుక్కొతికే పశిగడ్తడు అవ్వా!"
 గట్ల పశిగట్టి గియ్యాల ఏం జేశిండో తెల్సా! ఇంట్లె అత్తని వొంట గింట కొంపల సేశేవ్ గిట్ల.మాల్ పటేల్ ఇంట్ల దావతుందని శెప్పిండంట".
''ఇంకేముంది.అత్త తనొర్కు గుడ్డుపుల్సు బెట్టుకొని సుష్టుగా తిన్నదంట. శేని కాడ శనిగె శేను పీకిచ్చే ట్యాలకి ఆలీశం అయ్యిందంట.
 ఆకాడికి అత్త అంటనే ఉందట.గింతాలిసమైంది. ఆడ వుంటదో ఉండదో వొంట శెయ్యనా అంటే అత్తని ఏం దెల్వని ఎర్రి మొహం దాన్లెక్క సూశిండట. గబ్బగబ్బ కాల్శేతులు కడుక్కొని మాల్ పటేల్ ఇంటికి బొయ్యేతల్కి ఎంగిలి ఇత్తళ్ళు తీసి పనోళ్ళు శుబ్బరం చేత్తుర్రంట.తెల్లమొగమేస్కొని ఇంటికొత్తె అటికెల పుల్సులేదు.సర్వల బువ్వ లేదట."
 " పాపం మావఁ ఆకల్కి గిలగిల్లాడుంటడు.అటు " ఇంటి కూటికీ ఇటు బంతి కూటికీ రెంటికీ శెడిండన్న మాట."
 "అవునవ్వా! రెంటికీ శెడిన రేవడి అయ్యిండు. పాపం ఎక్కడి గిలగిల్లాడుడు పో! శోషొచ్చి,బెహోషై పడిపోయిండంట.అప్పటికప్పుడు అత్త పొయ్యి రాజ్జేసి అన్నం వొండితే మావిడికాయ తొక్కు,సల్ల సుక్కతో తిన్నంక గని నోట్లె మాట రాలేదట".
గదండీ సంగతీ! "ఇంటి కూటికీ బంతి కూటికీ రెంటికీ చెడినట్లు అయ్యిండు"  అంటే గిదే మరి. ఏల తప్పి పోతే ఏడ దొరుకుద్ది. కొందరు పయానమై పొయ్యెటప్పుడు వొక్క ముద్ద తినిపొండ్రి.ఏ యేలైద్దో అన్న సుత తినిపోరు సూడ్రి.గయ్యాల గదేం శిత్రమో గని తిండి దొరక్క అల్లాడిపోవుడే. శానా త్యేపల శానా మందిరికి అనుబవం అయింది శెల్లే!"
"అవునవ్వా!  ఎవలో ఎందుకు నాకే అయ్యింది. నాకోపాలి తాకిడి తలిగింది. గయ్యాల్నించి తినమన్నప్పుడు మాటొర్సకైన ఒక్క ముద్దైన తినెల్తవ్వా!."
కామెంట్‌లు