ప్రాణవాయువులనిచ్చే చెట్లను నరికితే విషాదమే,
జలజలా ప్రవహించే నీటిని కలుషితం చేస్తే ప్రళయమే,
కొండలను,గుట్టలను పేలిస్తే తీరని నష్టమే,
వాగులను,వంకలను చెరిపితే
క్షామమే,
పసిడి రాసులనిచ్చే పంటచేలను పాడుచేస్తే పస్తులే,
ధరణిని విషతుల్యం చేసే రసాయనలతో చేటే,
నాగరికత ముసుగులో వాహనాల అధిక వాడకంతో గాలంతా విషమే,
చెట్టు,చేమలను లేకుండా చేస్తే సంక్షోభమే,
జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే అంధకారమే,
ప్లాస్టిక్ వినియోగం విషతుల్యమే,
సహజ వనరుల విధ్వంసంతో మానవాళికి ముప్పే,
నదులను స్వచ్ఛంగా ఉంచలేకపోతే దప్పికే,
సముద్రాలను అసహజీకరిస్తే సునామే,
అడవులను విస్తరించి,పరిరక్షించలేకపోతే నరకమే,
పాడిని పెంపొందించకపోతే ప్రకృతికి అసమతుల్యతే,
మానవాళి మనుగడకు విచక్షణే మంత్రం.
చేయి చేయి కలిపి పర్యావరణాన్ని కాపాడితేనే
జీవనం సుఖమయం.
తెలుసుకోవాలి మనమందరం,
ఆచరించి,ఆయుష్షును,
ఆరోగ్యాన్ని పొందాలి లోకం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి