ఎలా మానేస్తాం.!!?: -డా ప్రతాప్ కౌటిళ్యా.
మనం చూడడం మానేస్తాం
వినడం మానేస్తాం 
మాట్లాడడం మానేస్తాం
కానీ 
ఆలోచించడం ఎలా మానేస్తాం.!!?

చూడడం వినడం మానేస్తే 
మాట్లాడడం మానేస్తాం
చూడడం వినటం మాట్లాడడం 
మానేస్తే 
ఆలోచించటం మానేస్తామా.!!?
కానీ 

గతం -జ్ఞాపకం 
మాట్లాడిస్తుంది -ఆలోచి‌ంపజేస్తుందీ.
జ్ఞాపకం మరణిస్తే 
ఆలోచన చస్తుంది. 

స్పందించకుండా 
ప్రతిస్పందించకుండా ఉంటే 
జ్ఞాపకం చస్తుంది. 

ఆలోచన-వర్తమానం 
జ్ఞాపకం-గతం 
ఆలోచించడం మానేస్తే 
గతం లేదు వర్తమానం లేదు 
ధ్యానము లేదు.!!

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శ్రీ శ్రీ కళావేదిక గౌరవాధ్యక్షుడు.

కామెంట్‌లు