వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి : -\ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-\సెయింట్ లూయిస్ -అమెరికా

 పవిత్రగంగానది ఒడ్డున 
పుణ్యక్షేత్రమైన కాశీ నగరంలో
ఉదయించిన భరత మాత ముద్దు బిడ్డ 
భారతీయుల అపర దుర్గ ఝాన్సీ.
బాల్యంలో మణికర్ణిక నామధేయం కలిగి 
పదమూడు సంవత్సరముల ప్రాయంలోనే ఝాన్సీ రాజు గంగాధరరావుతో
వివాహామై 
మహారాణి ఝాన్సీలక్ష్మిభాయి గా మారి 
దామోదర రావును దత్తత తీసుకున్న మరునాడే 
భర్త మరణం 
బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసి చే  దత్తత నిరాకరణతో 
తన ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించ 
గుర్రపు స్వారీ , విలువిద్యలయందు అరితేరి  మహిళలకు కూడ
ఆనాడే పోరాటపటిమ నేర్పిన భరతమాత జాతిరత్నం.
మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో 
తాంతియా తోపేతో కలసి 
నడుముకు పుత్రుని కట్టుకు గుర్రం పై వీరోచితంగా అపరదుర్గ వలె పోరాడి
బ్రిటిష్ వారి గుండెల్లో సింహా స్వప్నంగా నిలిచి 
చివరకు అమరపురీ చేరిన 
వీరనారి ఝాన్సీ 
మీకివే నా అక్షరాంజలులు.!
...............................

కామెంట్‌లు