గెలుపు రాక ఉండునా?
చీకటుందని తాను
వెలుగు రాక మానేనా?
కనుల కునుకు లేదని
కలలు ఆగిపోవునా?
కలత తీరు వరకూ
కథలు మారక నిలిచేనా?
చినుకు కోసం చూసే
చివురు రాక ఉండునా
చితికిన మనసున కూడా
చింతలు మాయక నిలిచేనా?
పెదవి పలకలేదని
భావం ఆగిపోయేనా?
చెప్పలేని ఊసులైనా
చెదిరి బెదిరి పోయేనా?
మనసు ఊరుకోలేదని
మాట ఆగిపోయేనా?
మదికి తెలిసిన భాషలో
మమత చెవికి చేరదా?
రెప్పలు దాచిన స్వప్నాలు
రెక్కలు తొడిగే తరుణంలో
రేయిని తరిమే కిరణాలు
రేపును మదిలో అలజడులు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి