మార్గంలో పరుశరాముడు ఎదురవుట : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వారు అయోధ్యపురము వెళ్ళు తోవలో 
మృగములు ప్రదక్షపూర్వకముగా 
పక్షుల అరుపులు అశుభసూచకంగా 
కనులకు కనిపించి  చెవులకు వినిపించును

అశుభముల గూర్చి వశిష్టోనని ప్రశ్నించారు 
ఓ మహర్షి కర్ణ కఠోరమైన అరుపులు 
భయంకరంగా వినిపిస్తున్నాయి 
నా మనసు కలవర పడుతుంది 

దశరథ ఈ శబ్ద ఫలితమును వినుము 
పక్షులు అపశుభములు తెలుపగా 
మృగాలు శుభసూచకం చూపుతున్నాయి 
దశరథనీకు కలవరము భయం వద్దు 

అదే సమయంలో రాత్రి సూర్య తేజస్సుతో 
గొడ్డలి వేటుతో చెట్లు నేలకొరిగినట్టుల 
భయంకరమైన శబ్దం ఆవరించెను 
ఆ శబ్దంతోఅందరూ మూర్చ చెందినారు

వశిష్టుడు దశరథుడు రామలక్ష్మణులు 
మాత్రమే అచ్చట తేరుకొని ఉన్నారు 
జమదగ్నికుమారుడు పరుశురాముడు
ప్రళయకాలరుద్రనివలె యున్నాడచట


కామెంట్‌లు