అహంకారం అణగాలి: - - యామిజాల జగదీశ్
 ఒక వ్యక్తి ఒక భూతాన్ని రప్పించి, తాను కోరుకున్నదంతా దాని చేత చేయించుకోవాలని భావించి, దానికి కావలసిన సాధనలలో నిమగ్నమ య్యాడు. కొన్ని మంత్రాల శక్తి వల్ల, అతను భూతాన్ని తన ముందుకు రప్పించగలిగాడు. భూతం కూడా అతని ఆజ్ఞలకు లొంగి నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది.
కానీ ఆ భూతం ఒక షరతు విధించింది. 
"ఎప్పుడైనా మీరు నాకు పని ఇవ్వకపోతే, నేను మిమ్మల్ని మింగేస్తాను. మీరు నాకు ఇరవై నాలుగు గంటలూ పని ఇస్తూనే ఉండాలి" అని చెప్పింది. ఆ వ్యక్తి అందుకు అంగీకరించాడు. 
వెంటనే తనకు ఒక పెద్ద భవనం నిర్మించి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అతను ఎంతో ఆశ్చర్యపోయేలా, అనతి కాలంలోనే ఓ భవనం నిర్మించిందా భూతం. 
తరువాత ఒక పొడవైన రహదారిని నిర్మించమని ఆదేశించాడు. ఆ నిర్మాణ పని కూడా కొద్దిసేపట్లోనే పూర్తయిపోయింది. 
మరుసటి నిమిషమే భూతం అతని ముందు నిలబడింది. "ఇంకా పని ఇవ్వండి" అని అడిగింది. 
అతనికి ఆలోచించడానికి కూడా సమయం లేదు. 
ఒక పెద్ద నగరాన్ని సృష్టించమని ఆజ్ఞాపించాడు. 
అది కూడా తయారైపోయింది. 
దాంతో ఆ వ్యక్తి గందరగోళంలో పడ్డాడు. భయపడ్డాడు. కొత్తగా ఏం చెప్పాలో అతనికి తెలియలేదు. పని ఇవ్వకపోతే, భూతం అతనిని మింగేస్తుంది. 
అతను ఒక మహానుభావుడి (మహర్షి) వద్దకు వెళ్లి భూతాన్నెలా వదిలించుకోవాలో చెప్పండని ఆయనను సలహా అడిగాడు.
ఆ మహానుభావుడు ఒక వెదురు కర్రను భూమిలో పాతమని సలహా ఇచ్చారు. మరో పని చెప్పే వరకు ఆ కర్రపై భూతం ఎక్కి దిగుతూ ఉండాలని చెప్పమన్నారు. అతను అలాగే చేశాడు. భూతం ఆ ఆజ్ఞను నెరవేర్చక తప్పదు కదా. అంటే భూతానికి విశ్రాంతే లేదు. చివరికి, అది విసిగిపోయి పారిపోయింది.
ఇప్పుడు మీ విషయంలోనే చూడండి. "రామ నామమే ఆ కర్ర. అహంకారమే మిమ్మల్ని భయపెట్టే భూతం. మళ్లీ మళ్లీ కర్రపై ఎక్కి దిగమని దానికి చెప్పండి. అది త్వరలోనే అలసిపోయి పారిపోతుంది. అహంకారాన్ని అణచడానికే రామ నామం మీకు చెప్పడమైంది. అహంకారం నశించాలంటే దాని సొంత ప్రయత్నం వల్లే అది జరగాలి అని స్వామి రామదాస్ తమ ఉపన్యాసంలో చెప్పిన కథ ఇది.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం