దక్కింది.!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
నీరు 
ఆవిరైన 
మేఘం గా మారిన
వర్షమైన 
నదిగా మారిన 
చివరికి సముద్రంలో చేరిన 

వెలితి పడక 
సముద్రం ఒక్కటే ఇలా అంటుంది. 
నాది నాకు చేరింది 
నాది నాకు దక్కిందని.!!?

మనిషి 
మంచి గాలిని ఎంత పీల్చిన 
చెట్టు 
చెడుగాలిని ఎంత పీల్చిన 

మనిషి చెట్టు 
ఒకదానికొకటి వెలితి పడక
ఇలా అంటున్నారు. 

చివరికి చివరి వరకు 
నాది నాకు చేరింది 
నాది నాకు దక్కిందని.!!
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.

కామెంట్‌లు