విష్ణు ధనస్సు గూర్చి శ్రీరామునికి తెలుపుట : - ఎడ్ల లక్ష్మి- సిద్ధిపేట
శివధనస్సు నిస్తేజమగుట గాంచిన 
దేవతలు విష్ణువే అదికుడని తలచిరి
శివుడు అందుకు మిక్కిలి కృద్దుడై 
ఆ మహాదనువును దేవరాతుని వద్ద యుంచెను

శత్రువర్గములను నశింప చేయుటకై
వైష్ణవ ధనస్సును బుచీకునికడ ఉంచెను
అతడు దివ్య ధనస్సును జమదగ్నికిచ్చును
మా తండ్రి అస్త్రసన్యాసము చేసియుండగా 

కార్తవీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో 
భయంకరంగా మా తండ్రిని వధించినాడు 
ఆ కోపంతో నేను ఇరువది యెక్కమార్లు
క్షత్రియులను పుట్టిన వారిని పుట్టినట్టు సహరించితిని

సమస్త భూమండలమును జయించి 
కాశ్యపమహర్షికి దక్షణగా సమర్పించితిని 
తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని 
ఆ గిరినుండి శివధనుస్సు ధ్వనివినివస్తిని

ఓ శ్రీరామ! తాత ముత్తాతల నుండి 
నాకుసంక్రమించిన ఈ మహాదనస్సును 
నీవు క్షత్రియధర్మమును అనుసరించి  
నీ శక్తితో విష్ణు ధనస్సును సంధింపుము 
అప్పుడు నాతో ద్వంద యుద్ధము జేయుము. 


కామెంట్‌లు