కాగితం పూల కామాక్షి:-డా. కందేపి రాణీప్రసాద్
 కాగితం పూల చెట్లు ఎక్కువగా డివైడర్ల మీద నాటుతారు. సహజంగా పెరిగే చెట్లు రహదారుల్లో రోడ్లకిరువైపులా పెరుగుతుంటాయి. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు మొదటగా ఇంట్లో కాగితం పూల చెట్టును నాటాను. చాలా పెరిగింది. మా ఇల్లును కప్పేసింది. ఇవి కాగితంలా పలుచగా ఎక్కువ కాలం వాడిపోకుండా ఉంటాయి.  ఇవి దక్షిణ అమెరికా దేశానికి చెందినవి. వీటిని ఇంగ్లీషులో ‘‘బోగన్ విలియా’’ అంటారు కదా!ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా! బ్రెజిల్‌లో ఉన్న ఫ్రెంచి నావికా దళాధికారి ఈ చెట్లను కనుగొన్నాడు. ఈ విషయం 1768వ సంవత్సరంలో జరిగింది. ఆ ఆ అధికారి పేరు ‘‘లూయిస్ డి బోగన్ విల్లే’’. అందువలన ఆయన పేరు మీదుగా బోగన్ విలియా అని పిలవడం మొదలుపెట్టారు. వీటిలో గులాబీ, ఎరుపు, ఊదా, నారింజ, పసుపు, తెలుపు వంటి అనేక రంగులు ఉంటాయి. మనకు కనిపించే పువ్వులు అసలైన పువ్వులు కాదు.  ఇవి ఆకర్షణ పత్రాలు. మనకు కనిపించేది ఆకర్షణ పత్రాలే. నిజమైన పువ్వులు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి‘‘ కారియో ఫిల్లేలిస్’’ క్రమానికి చెందినవి.
చింత గింజలతో అమ్మాయి శరీరాన్ని తయారు చేశాను. ఊదా రంగు కాగితం పూలతో పరికిణీ కుట్టాను. దీనికి ఆకుపచ్చని సన్నజాజి ఇకుల బ్లౌజ్ కుట్టాను. చింతగింజల పిలకలలు వేశాను. తలలో పూలు పెట్టాను. మెడలో నెక్లెస్ పెట్టాను. కాళ్ళకు సాక్సులు వేశాను. ఇలా ముద్దుగా తయారైన కామాక్షి ఒక చెట్టు కింద నిలుచుంది. స్కూలు బస్సు కోసం ఎదురు చూస్తోంది. కాగితం పూల చెట్టు కిందే నిలబడింది. బాగుందా మా కామాక్షి.

కామెంట్‌లు
Popular posts