సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -248-ఆరితే అల్లం శొంఠి అయినట్లు
****
"అవ్వా! నిజ్జంగా గా మడిషిని సూత్తుంటే బలే అబ్బురంగ అనిపిత్తది. శిన్నప్పుడు శిర్గుల సొక్కా,పగిలన పల్క బట్టుకొని బడికి వొచ్చేటోడు. వాళ్ళ అయ్యయితే శింత బరిగె బట్కొని పోరడా నీకు సద్వెందుకురా!  నువ్వు బడికొత్తే గా గొర్లనెవడు సూత్తడు గీ బర్లనెవడు కాత్తడని బెద్రిచ్చేటోడు. గప్పుడు పెద్ద పంతులు గానికి సద్వుమీద గంత కాయిషుంది రానియ్యమని వాళ్ళయ్యని నచ్చజెప్పింది గిప్పటికీ కళ్ళముందు మెదులుద్దవ్వా!"
 "అవునా! తమ్మీ!గింతకీ ఎవలి ముచ్చెటి నువ్వు శెప్పేది?"
 "గదేనవ్వా మన శంకరయ్య తాత మన్వడు నా కంటే శిన్నోడే.నేను నాల్గుల ఉన్నప్పుడు బల్లె ఆనంతట ఆడే బల్లెకొచ్చి  సద్వుకుంట మా నాయిన పిలిత్తె పంపకుండ్రి అని పెద్ద పంతుల్ని సార్లని బతిలాడిండు.'గింత శిన్న పోరడికి గంత కాయిషా' అని సంబురంగ శంకరయ్య తాతని పిల్శిండ్రు. తాత శెప్పిన ఇవురాల్తో బల్లె గాని పేరెక్కింది."
 "గా వొద్దు నుంచి గాడు సద్వుల పష్టే,ఆటల్ల పష్టే. ఎందుల సూశినా గాడే ముందుండెటోడవ్వా! శివరాకరికి గాని నాయినే దిగొచ్చిండు. గట్ల మనూల్లె సద్వుకుంటనే గాళ్ళ గూడెంల శిన్న పోరలకి సద్వు శెప్పేటోడు.కొందరైతే గీ పోరడు పోవుడే కాక పోరగాండ్లని శెడగొడ్తుండని తిట్టేటోళ్ళు. అయిన సుత పట్టొదల్లె. గియ్యాల శిన్నబల్లె సద్వుజెప్పే సారైనోడు.ఇంకా ఇంకా సద్వి పెద పెద్దోళ్ళకి సద్వులు జెప్పే పేద్ద సారయిండవ్వా!"
 ఎంత మంచి ముచ్చెటి శెప్పినవ్ తమ్మీ! శిన్నతనాన లగ్గమై వొచ్చిన నాకు గానిషయం తెల్వనేలే. గియ్యాల నువ్వు శెప్తుంటే శెవులకి యినసొంపుగ,నోట్లె పందారబోశినంత తియ్యంగుంది.గా శిన్నప్పటి బాచిగాడు గింత పెద్ద పేరు తెచ్చుకుండంటే,సూరునొతికె ఎలుగు పంచుతుండంటే మస్తు అబ్బురంగ,సంబురంగ ఉంది రా! గాన్ని శిన్నతనంల సూశిన రూపే కండ్లముందు మెదలవట్టింది."
"అవునవ్వా! సద్వుకోసం కన్నమ్మ కట్టాలు బడ్డడు.గాళ్ళు మంది గొర్లు,బర్లు కాశి బత్కెటోళ్ళు. ఐతారం వొత్తే వాళ్ళ నాయినెంబడి వాట్ని కాయబొయ్యేటోడు. కూలికి బొయ్యిండు.తట్టలు మోశిండు. ఏపని దొర్కితే గా పని జేసి ఎవలి దెగ్గర శెయ్యి సాపకుండ,ఎవలిచ్చినా తీస్కోకుండ కట్టపడ్డడు.గిప్పుడు సుకపడుడే గాదవ్వా! కోరికుండాలె గని ఏదైన సాదిచ్చొచ్చని సుబూది జేశిండవ్వా!''
 "ఒరేయ్ బుడ్డోడా!భూలచ్మీ! తాతయ్య ఏం జెప్పిండో యింటుర్రు గద. గట్ల కాయుషు బడి సద్వాలే,నేర్వాలే మీరు సుత. "ఆరితే అల్లం శొంఠి అయినట్లు" ఎంత గొప్పోడు అయిండో యిన్నరు గద!"
"అవ్వా! ఆరితే అల్లం శొంఠి అవ్వుడేంది" గీ దీన్కి గా తాతకి ఏం సంవందమో సమజవ్వలే?"
 "గట్లడుగుండ్రి శెప్త.మీకు అల్లం దెల్సుగద గా అల్లం మనం నిత్తెం కూరల్ల ఏత్తం,శాయిల అప్పుడప్పుడు ఏస్కోని తాగుతం.గది మన వొంటికి శానా శానా మేలు శేత్తది. ఇంగ అల్లం ఆరితే అంటే ఎండితే శొంఠి అయితది,గది సుత అల్లం లెక్కనే మన వొంటికి శానా శానా మంచిది. గట్ల శిన్నప్పుడూ మంచి పేరే,గిట్ల పెద్దయినంక సుత మంచిపేరు తెచ్చుకునేటోళ్ళని గిట్ల గీ సామెతతో పోలుత్తరు.సమజైంది గద మీరు సుత గిప్పన్నించే మంచి పేరు తెచ్చుకోవాలె.పెద్దయినంక ఫలానా పిల్లలు శిన్నప్పన్నించి మంచోళ్ళు అనాలె" అందరు."
 "గట్లనే అవ్వా! మంచిగ సద్వుకుంటం.మంచిపేరు తెచ్చుకుంటం" అన్కుంట బుద్ధిగ తలూపుతున్న బుడ్డోడు,భూలచ్మిని దగ్గర్కి తీస్కొని ముద్దు జేసిండ్రు అవ్వా, తమ్ముడూ."
గదండీ సంగతి"ఆరితే అల్లం శొంఠి అయినట్లు అంటే గిదే మరి "

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం