నిజమే కదు.....!! : - కోరాడ నరసింహా రావు!
నిజమే....., 
  ఎవరి బ్రతుకులు వారే అందముగా, ఆకర్శణియముగా తీర్చి దిద్దుకో వలసిందే...! 
 వేరెవరో ఈ పని చేస్తారనుకునే భ్రమలో బతి కేస్తూ.... 
   ప్రతికూల ఫలితా లొస్తే పరులను నిందించటం పరిపాటి....!! 

మనల్ని మనం అందంగా మలుచుకోవట మంటే...., 
 మన పూర్వ కర్మ ఫలా నుభవాలలో... 
    భరించ లేని కష్టాల బాధల ఉలి దెబ్బలను ఓ ర్చు కుంటూ... 
   సహన0తో తనను తాను తీర్చి దిద్దు కోవటమే....!!

ప్రారబ్ధ ఉలి దెబ్బ లను భరిస్తూ... 
  సత్కర్మలతో ఆగామిని మలచు కుంటూ... 
  సంచితముల సంచిని నింపు కుంటే.... 
 మారు జన్మ సాఫల్యం పొందుతుంది...!! 
  అప్పుడే నీవు సమాజం లో అందరిచేత ఆకర్షింప  బడి ఆనందముగా బ్రతుక గలవు...! 
    ఇది సత్యము.... 
  ఇదే సత్యము.... 
   ముమ్మాటి కిదియే సత్యము....! 
      ****


కామెంట్‌లు