ఉత్పలమాల: - ఉండ్రాళ్ళ రాజేశం

 మొక్కను నాటినన్ పెరిగి మోక్షము బొందగ వృక్షమయ్యెగా
పెక్కుగ గింజలై ధరణి పీఠము నాటుతు సాగినంతగన్
లెక్కలు లేని యాతరువు రెక్కలు వాల్చిన పచ్చనాకులై
చక్కగ వర్షముల్ గురిసి జక్కగ పంటలు పండురైతుకున్!!


కామెంట్‌లు