హలో పిల్లలూ! చామంతి పూలను దేవుళ్ళకు పెట్టటం, తలలో పెట్టుకోవటం చూసి ఉంటారు. కానీ ఆడపిల్ల తయారు కావడం చూడలేదు కదా! ఇప్పుడు చూస్తారు. బంతులతోనూ, చామంతులతోనూ, చమేలీ పువ్వులతోనూ, గులాబీ రెక్కలతోనూ ఆడపిల్ల వచ్చేసింది. ఈ పాపను చూసి ‘‘బంతి చామంతీ ముద్దాడుకున్నాయిలే’’ అని పాటలు కూడా పాడుకోవచ్చు. పూజలకు, గృహాలంకరణలకు, దండలకు విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆడపిల్లల పూల జడలకు కూడా వేస్తారు. కానీ కొద్దిగా బరువు ఉంటుంది. చామంతి బిళ్ళల జడ అంటారు. పూర్వం ప్రతి మహిళకు వచ్చే ఈ జడలు, ఇప్పుడు పూల వ్యాపారస్తులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందిన మొక్క. మా కుండీలలో మూడు రంగుల చామంతులున్నాయి. దీని శాస్త్రీయ నామం ‘‘క్రి సాంధిమమ్ ఇండికం’’. తెలుపు, పసుపు, ఊదా రంగులున్నాయి మా ఇంట్లో. వీటిలో ముప్పై రకాలున్నాయి. ఇవి శీతాకాలంలోనే పూస్తాయి. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చిట్టి చేమంతి. పట్నం చేమంతి, నక్షత్ర చేమంతిలనే రకాలుంటాయి. తేలిక పాటి నేలలు అనుకూలంగా ఉంటాయి.
తలను బంతిపూలతో తయారు చేశాను. రెండు జడలు వేశాను. గౌనుకు తెల్ల చామంతులతో కుట్టాను. చేతుల్ని మాత్రం చమేలి పూల దండలలో చేశాను. కొప్పులో పూలు పెట్టుకుని కాళ్ళకు బూట్లు వేసుకుని అందంగా తయారయింది. గులాబి ఆకుల జూకాలు పెట్టుకున్నది. చక్రాల్లాంటి కళ్ళు, ఎర్రటి పెదవులు అందానికే అందంలాగా ఉంది ముద్దుగుమ్మ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి