( పి.సి మహలనొబీస్ జయంతి, జాతీయ గణాంకాల దినోత్సవం)
మానవాభివృద్ధిలో గణాంకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని , కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు ఆర్థిక విధానాల రూపకల్పనలో గణాంకాలు దిక్సూచిగా పనిచేస్తాయని అటువంటి గణాంకాల రూపకర్త ప్రశాంత చంద్ర మహలనొబిస్ గారని వారిని విద్యార్థులు, యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు.
తేదీ 29-06-2026 రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి.సి. మహలనోబీస్ జయంతిని ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆయన ఫోటో కు పూలాలంకరణ చేసారు.
ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ మహలనొబిస్ 1893 జూన్ 29న కలకత్తాలో జన్మించారని, 1912లో భౌతిక శాస్త్ర అధ్యాపకులుగా ఆ తర్వాత ప్రిన్సిపాల్ గా 30 సంవత్సరాలు సేవలందించారన్నారు. 1933లో గణాంక శాస్త్రం పత్రిక ప్రారంభించారని, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించారని, ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టినప్పుడు రూపకల్పనలో కృషి చేసారని, రెండవ ప్రణాళికను తానే రూపొందించారని,1950లో ఏర్పడిన ప్రణాళిక సంఘం సభ్యుడిగా, సలహాదారుగా పని చేశారని, ఐక్యరాజ్యసమితి గణాంకాల సలహాదారుగా, గౌరవ అధ్యక్షులుగా కొనసాగారని, భారతపద్మవిభూషణ్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వెల్డన్ మెడల్ పురస్కారం పొందారన్నారు. భారత గణాంకాల పితామహుడు మహలనోబీస్ గారని అంతర్జాతీయంగా ఆయన సేవలను కొనియాడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసరవేణి పర్శరాములు, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణుప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్, అనుముల రవిచంద్ర, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విష్ణుదాసు విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి