సుప్రభాత కవిత : - బృంద
భువినేలు దినరాజుకు 
తడి ఇసుకల ఆహ్వానం 
తొలివెలుగుల రేఖలకు 
కడలి అలల అభిషేకం 

వెడలిన వెలుగులరాయనికి 
అడుగులు కడిగిన అంబుధి 
వేచిన  నల్లని మబ్బులను 
తరిమిన బంగరు వెలుగులు 

నిండిన ఆశల దివ్వెలతో 
పండిన భాగ్యం వస్తుందని 
దండిగ సహనం నింపుకుని 
మొండిగా నిలిచిన బ్రతుకులు 

తారాదీపం  చూపించే 
సుదూరతీరాల విజయాలు 
చేరే దారులు చూపుమని 
కోరే బేల హృదయాలు 

కొత్తవెలుగులు కొని తెచ్చే 
తాయిలమేదో చూడాలని 
చిక్కని కాంతులు చెప్పే 
చల్లని కబురు వినాలని...

తండ్రికై వేచే చిన్నిపాపలా
తల్లికై చూసే చంటిబిడ్డలా 
వాన కై చూసే వేసవిలా 
చినుకు కై చూచే  చిగురులా...

మనసు మందిరం కాగా 
కల లు జ్యోతులు కాగా 
కనుల దొరలిన నీరే 
దోసిలి పట్టి వేచిన మనసులకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు