"స్నేహబంధం" , "తెలుగు తోట " పుస్తకాల పరిచయ సభ

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న  విరచిత "స్నేహ బంధం"  మరియు "తెలుగు తోట" పుస్తకాల పరిచయ సభ రాగ మయూరి, కర్నూలులో ఘనంగా జరిగాయి.చిననాటి ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు డా. సౌధాకర్ రాజు, జిల్లా అధికారి అసిస్టెంట్ DWMA రాజేంద్ర ప్రసాద్,పోలీస్ శాఖ ఉద్యోగి మధు సురేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు టి. యస్వి. రవికుమార్ మరియు విచ్చేసిన ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించి, పుస్తకాలు పరిచయం చేశారు.అనంతరం బహు గ్రంథ గద్వాల సోమన్నను సత్కరించారు. ఈ కార్యక్రమంలో  జోషప్, కృపరాజు, చిన్నరాజు, ప్రసాద్, యిర్మీయా, మోసెస్, తిమోతి, సంతోష్,మనోజ్, విజయరాజు, శ్యామ్ మున్నగు వారు పాల్గొన్నారు.
కామెంట్‌లు