పల్లవి :
వెలుగును పంచే భాస్కరుణ్ణి
లోకానికే ప్రాణం పోస్తానండీ!
తూర్పు దిక్కున పుడతానండీ
పడమర దిశలో ఆగుతానండీ
!!వెలుగు!!
చరణం :1
వేడిని ఇచ్చే రవిని నేనండీ
పగలును మీకు ఇస్తానండీ
మంచును కరిగించే ఎండనండీ
చీకటిని తరిమి కొడతానండీ
!!వెలుగు!!
చరణం :2
బంగారు కాంతులు నేనండీ
జీవుల ఆకలి తీరుస్తానండీ
రంగుల విల్లను తెస్తానండీ
హాయిని ఎంతో ఇస్తానండీ
!!వెలుగు!!
చరణం :3
కొండల పైన ఉంటానండీ
అందరి పైనా ఉంటానండీ
నాకు ఎదురు ఎవరూ లేరండీ
నేనే జగతికి సాక్షినండీ!
!!వెలుగు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి