ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూ ఉండే కృష్ణుడు ఆరోజు ఎందుకో మౌనంగా ఉన్నాడు.
అతని చూపు ఒక ఇత్తడి గిన్నె (నీళ్ల పాత్ర) మీద పడింది. అందులో నీళ్లు నిండుగా ఉన్నాయి. మెల్లగా దగ్గరకు వెళ్లి అఃదులోకి తొంగి చూశాడు.
లోపల ఇంకొక కృష్ణుడు ఉన్నాడు.
కృష్ణుడు వెంటనే కళ్లు పెద్దవి చేశాడు.
ఆ కృష్ణుడు కూడా కళ్లు పెద్దవి చేశాడు.
ఇతడు నవ్వాడు.
అతడూ నవ్వాడు.
కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది.
“అన్నయ్యా... ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు...” అంటూ బలరాముడిని పిలిచాడు.
బలరాముడు ఆ పాత్రలోకి తొంగి చూసి నవ్వాడు.
“అది నువ్వేరా...” అన్నాడు బలరాముడు.
కానీ కృష్ణుడు అస్సలు నమ్మలేదు.
మళ్లీ కిందకు వంగి,
“నువ్వు ఎవరు?” అని అడిగాడు.
లోపల ఉన్న కృష్ణుడు కూడా నోరు తెరిచి ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
కృష్ణుడు వెంటనే సంతోషంగా నవ్వాడు.
చెయ్యి ఊపాడు.
లోపల ఉన్న కృష్ణుడు కూడా చెయ్యి ఊపాడు.
“అన్నయ్యా... వీడు నాలాగే ఉన్నాడు...” అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వు ఆపుకుంటూ నిలబడ్డాడు.
అప్పుడు కృష్ణుడు తన చేతిని నీళ్లలోకి పెట్టాడు.
లోపల ఉన్న కృష్ణుడి బింబం చెదరిపోయి మాయమైపోయింది
కృష్ణుడు దిగులుపడ్డాడు. కంగారుపడ్డాడు. అన్నయ్యతో లాభం లేదనుకుని యశోదమ్మను పిలిచాడు.
"అమ్మా! ఇప్పటి వరకూ నీటిలో ఉన్నతను పారిపోయాడమ్మా... వాడు అచ్చం నాలాగానే ఉన్నాడమ్మా!" అని అరవడం మొదలుపెట్టాడు.
యశోద పరుగున వచ్చి,
“ఎవర్రా?” అని అడిగింది.
కృష్ణుడు ఆ పాత్రను చూపిస్తూ,
“ఇప్పుడే ఇక్కడ ఉండటం నేను చూశాను...నువ్వొచ్చే లోపల పారిపోయాడమ్మా...” అన్నాడు.
యశోద నవ్వు ఆపుకుంటూ అతడి పక్కన కూర్చుంది.
“కొంచెం ప్రశాంతంగా (నిశ్శబ్దంగా) చూడు...” అంది.
కృష్ణుడు మళ్లీ తొంగి చూశాడు.
క్రమేపీ నిశ్చలమైన నీటిలో ఆ బుజ్జి కృష్ణుడు మళ్లీ ప్రత్యక్షం...
“అమ్మా!వచ్చేశాడు!” అని చప్పట్లు కొడుతూ గెంతడం మొదలు పెట్టాడు. అతడు నవ్వాడు.
లోపల ఉన్న కృష్ణుడూ నవ్వాడు.
కృష్ణుడు అతడిని కాసేపు చూస్తూ ఉండిపోయాడు.
ఆ తర్వాత చాలా రహస్యంగా,
“నేను వెన్న ఎక్కడ దాచానో వీడికి తెలుసా?” అని బలరాముడిని అడిగాడు.
అది వినగానే యశోదకు, బలరాముడికి నవ్వు ఆపుకోవడం అస్సలు సాధ్యం కాలేదు.
లోకమంతా ఎవరి ముఖం చూడాలని తహతహలాడుతుందో ఆరోజు ఈ విశ్వప్రభువు తన ప్రతిబింబంతో స్నేహం చేసి ఓ ఆట ఆడాడు ఏమీ తెలియదన్నట్టు!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి