చుక్కకూర పూల చుక్కమ్మ : -డా.. కందేపి రాణీ ప్రసాద్

 హలో పిల్లలూ! చుక్క కూర పప్పు తిన్నారా! తినే ఉంటారు. చుక్కకూర పూలతో తయారైన ఆడపిల్లను చూశారా? చూసి ఉండరు కదా! ఆకుకూరలు రోజు తినాలని స్కూల్లో మాస్టారు చెప్పారా! కానీ ఆకుకూరలు తినరు కదా! ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తినాలి. చుక్కకూర పుల్లగా కమ్మగా ఉండే ఆకుకూర. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎ విటమిన్, సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనితో పప్పు, పచ్చడి, ఇగురు రకరకాలుగా వండుకోవచ్చు. దీనిని తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. దీని విత్తనాలు చిన్నగా ఆకులు కొద్దిగా గుండె ఆకారంలో ఉంటాయి. నేను మా కుండీలో పెట్టుకున్నాను. కూర కోసుకోకపోవడం వల్ల పూలు విపరీతంగా వచ్చాయి. కుండీల నిండా పూలు వచ్చాయి. ఆడపిల్లను సృష్టించాలనుకున్నాను. 
గౌను మొత్తాన్ని చుక్కకూర పూలతో కుట్టాను. ముఖానికి చెట్టు యొక్క పొట్టును వాడాను. మేము 25 ఏళ్లు పెంచుకున్న చెట్టును కొట్టేసినపుడు వచ్చిన పొట్టును దాచాను. ఆ తెల్లని పొట్టుతో అమ్మాయి ముఖాన్ని తయారు చేశాను. బిళ్ళ గన్నేరు పూలను కొప్పులో పెట్టాను. చామంతి ఆకుల్ని చెవులకు జూకాలుగా పెట్టాను. చేతి వేళ్లకు పెసర కాయల్ని పెట్టాను. అందమైన పక్క కొప్పుతో మా అమ్మాయి మెరిసిపోతోంది కదా!
కామెంట్‌లు