ఆశలు-ఆశయాలు: - జి.లింగేశ్వర శర్మ


పల్లవి
ఆశలు నెరవేరాలీ!
ఆశయాలు తీరాలీ!
అందపు గమ్యం చేరాలీ!
ఆనందాలను పొందాలీ!! 
!ఆశలు!

1.చ.
ఆశల తీరం జేరాలంటే!
ఆశయాలు నెరవేరాలంటే!
ఆత్మస్థైర్యం,విశ్వాసంతో!
అడుగులుముందుకువేయాలీ!
అడ్డంకులనధిరోహించాలీ!
ఆశయ సాధన సమరంలో!
ఆశల సౌధపు సాఫల్యంలో !
ఆశావహులై సాగాలి!!2!!
!ఆశలు!

2.చ.
ఆశలన్ని చిగురించాలంటే!
ఆనందం విరబూయాలంటే!
అడుగులుముందుకువేయాలీ!
అవరోధాల్వైదొలగాలంటే! 
అనితర సాధన కావాలెంతో !
అడుగడుగునతనుమనధనములనూ!
అనునిత్యం వెచ్చించాలీ!
ఆత్మస్థైర్యం పొందాలీ !!2!!
!ఆశలు!

3.చ.
ఆశలన్నియూ తీరిన వేళా! 
అంతా ఘనంగ మెచ్చినవేళా!
ఆనందము విరబూసిన వేళా!
హృదిలోఊయలలూగినవేళా! 
కష్టపు చీకటి తొలగిన వేళా! 
కాంతిప్రభలుగావెలిగిన వేళా! 
ప్రతిహృది పరిమళమందెడు హేలా!
పరమపవిత్రపుప్రభాతవేళా!!
!ఆశలు!

కామెంట్‌లు