ఎప్పుడు తనకు కథలు చెప్పి
కిట్టయ్యా రా రా అని అమ్మ దెబ్బలాడిందా
నాన్నతో చెబుతానని
ఆప్యాయంగా తీసుకుని
శ్రీరాముని గుడికి తీసుకెళ్ళి
దారిలో నాయుడు కొట్లో
తన చీరకొంగు విప్పి చాకెట్లు కొని
అల్లరి చేయకు బుద్ధిగా చదువుకో
నే చెప్పిన సుమతీ వేమన పద్యాలు వల్లె వేయని
నా పుట్టిన రోజున కొత్తబట్టలు కొని
నాకు ఆడుకునేందుకు
అందమైన కృష్ణుని బొమ్మ ఇచ్చిన
నానమ్మ వీధి వరండాలో పడుక్కుందేమిటన్న
రెండో చదువుతున్న బాబి గాడి ప్రశ్నకు
నానమ్మ దేముని దగ్గరకు చేరిందని చెప్పాను..!!
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి