నాన్న.... నాన్న.... నాన్న ,
ఏ పదము గొప్పది కాదు నీ కన్నా ,
వ్యక్తిత్వంలో అందరూ నీకంటే చిన్న ,
గుణములో ఎన్నటికీ నువ్వే మిన్న !
నీ మనసు నవనీతం ,
నీపేరు తలిస్తేనే మా జన్మ పునీతం ,
నీది స్వార్థము ఎరుగని మనస్తత్వం ,
మా ఎదుగుదల కోసమే శ్రమించే తత్వం !
చేయి పట్టుకొని బడికి నడిపించావు ,
చెడు దారిలో వెళుతుంటే మందలించావు ,
మంచి మాటలు చెప్పి నన్ను సన్మార్గం లో పెట్టావు ,
నా ఎదుగుదల కోసం నిరంతరం చెమట బొట్టు చిందించావు !
బాల్యంలో గుండెలపై తన్నితే ప్రేమతో భరించావు ,
నీ ఆకలి లోపలే దాచుకున్నావు ,
మా ఆకలి తీర్చడం కోసం అహర్నిశలు శ్రమించావు !
మా మీద ప్రేమానంతా గుండెల్లోనే దాచుకున్నావు ,
మా ఎదుగుదల చూసి లోలోనే మురిసి పోయావు,
పండుగ వస్తే మాకు కొత్త బట్టలు కొన్నావు ,
నువ్వు మాత్రం పాతవాటితోనే సాయిపెట్టుకున్నావు ,
మమ్మల్ని ఉన్నతస్థాయిలో చూడాలని నీ జీవితాన్నే ధారపోసావు !
లేదు నాన్నను మించిన దైవం !
నాన్నే మనకు ఒక ధైర్యం !
నాన్నే మన ఆత్మస్థైర్యం !
అసలు నాన్న అంటేనే ఒక భరోసా !!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి