ఇదేనా నీ సంస్కారం : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-( పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా
 ఉన్నతచదువులు   చదివావే 
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాడివే
చదువు సంస్కారు నేర్పుతుందని  అంటారే 
వణికే చేతులతో  నెమ్మదిగా బస్సు ఎక్కి
గవర్నమెంట్ ఆసుపత్రిలో  అనారోగ్యంగా ఉన్న 
ఏడుపదులు దాటిన భార్యను చూడటానికి వెళ్ళే 
ఆ ముసలాయనకు వృద్ధుల సీటులో  కూర్చుని 
నీ పక్కన ఉన్న భార్యతో కబుర్లు చెబుతు కూర్చుని 
అడిగే వరకు సీటు ఇవ్వకపోవడం న్యాయమా 
ఇదేనా నీ సంస్కారం 
తాత జోలె తర తరాలు అన్నది మరువకు...!
...............................

కామెంట్‌లు