నమ్మకం :- D. మణిదిప్ -10వ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు బెజ్జంకి - 944174433


 అన్నారంలో  విజయ్ లతా అనే ఇద్దరు భార్యాభర్తలు వాళ్లకు సౌమ్య రాజు అనే ఇద్దరు పిల్లలు సౌమ్య పదవ తరగతి రాజు 9వ తరగతి చదువుతున్నారు సౌమ్య చాలా మంచిది ఇంట్లో అమ్మానాన్నలు చెప్పినట్టు వింటది స్కూల్లో కూడా అందరితో స్నేహంగా ఉంటుంది మంచిగా చదువుకుంటుంది కానీ రాజు అలా కాదు చిన్నప్పటి నుంచి కూడా గడుగ్గాయి అమ్మ నాన్న మాటలు వినడు అందరితో గొడవ చదువులో వెనుకబాటుతనంగా ఉండేవాడు ఎప్పుడు ఎవరిని ఏదో కొన్ని డబ్బులు అడగడం చిల్లర ఖర్చులు పెట్టుకోవడం కొనుక్కొని తినడం ఇది వాడి దినచర్య ఇవ్వడం అనేది లేదు ఉపాధ్యాయుల మీద మర్లపడం స్నేహితుల తో అల్లరి చిల్లరగా తిరగడం చెడ్డ స్నేహాలు అక్కడ కూడా వాడి ప్రవర్తన ఏమీ బాగాలేక ఉపాధ్యాయులు ఎంత చెప్పినా వాడు వినక హాస్టల్ నుంచి కూడా చెప్పక చేయక వచ్చేస్తాడు 
 ఊరిలో రాజు మాటను ఎవరు వినరు వాళ్ళ తల్లిదండ్రులు స్నేహితులు తల్లిదండ్రులు కూడా వీటితో స్నేహం చేయొద్దు రాజ్తో తిరగవద్దు అని ఇతమ పిల్లలకి చెప్తూ ఉంటారు పాపం ఈ బాధను భరించలేక తల్లి తండ్రి ఇద్దరు కూడాy అనారోగ్య పాలవుతారు.
 తల్లిదండ్రులను డాక్టర్ దగ్గరికి సౌమ్య తీసుకొని వెళుతుంది చూపిస్తుంది డాక్టర్లు ఏమంటారంటే కొంచెం తండ్రికి ఇన్ఫెక్షన్తో కడుపులో అలసరి లాగా అయింది  ఆపరేషన్ చేయాలి అంటారు. ఈ విషయం రాజు కూడా తెలుస్తుంది అమ్మ కూడా చేతకాకుండా ఉంది ఏం చేద్దామని అక్కతో ఆలోచిస్తాడు నువ్వు అలా చిల్లర తిరుగుడు అయింది కదా ఎవరినైనా డబ్బు అడగరా, అడుక్కొస్తే ఆపరేషన్ చేపిద్దాం అంటుంది. రాజు ఎంతమంది దగ్గరికి వెళ్లి అడుగుతాడు కొన్ని డబ్బులు అవసరం ఉన్నాయి నాన్నగారికి ఆపరేషన్ చేయించాలి అప్పుగా ఇవ్వండి అని చెప్పి బతిలాడుతాడు ఎవరు నమ్మరు ఎందరిని అడిగిన బ్రతిమిలాడినా కానీ ఎవ్వరు కూడా ఇవ్వరు వీడు చిల్లర ఖర్చులకు పెడతాడు తాగి తందనాలు ఆడతాడు వీడికి డబ్బులు ఇయ్యొద్దు అని చెప్పేసి అందరు కూడా ఎవరికి వాళ్లు అనుకొని వాడికి అసలు డబ్బు వాడు వస్తేనే దూరంగా జరిగిపోతుంటారు. రాజుకు బాధనిపిస్తుంది ప్రయత్నం చేస్తూ ఉంటాడు పక్క ఊరికి వెళ్లి అక్కడ వాళ్ళ నాన్నకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా అడుగుతాడు వాళ్లు కూడా వీళ్ళ మాట నమ్మక డబ్బుల్లేవు ఏం లేవని పంపించేస్తారు. వస్తూ వస్తూ దారిలో ఒక చెరువు గట్టు దగ్గర కూర్చుండి బాగా ఏడుస్తాడు అయ్యో నాకు ఇలాంటి బుద్ధి ఎందుకు వచ్చింది అందరిలో నేను ఎందుకు మంచిగా లేను అని ఏడుస్తాడు వాడు ఏడుపును కూడా ఎవరి నమ్మరు. అయితే ఇక లాభం లేదని సౌమ్యనే దగ్గర ఉన్నటువంటి ఒక నాన్న గారికి తెలిసినటువంటి అతనికి విషయం చెప్పి కొంచెం డబ్బు తీసుకొచ్చి ఆపరేషన్కు సర్దుబాటు చేయాలనుకుంటుంది అమ్మ రాజుకు చెప్పకు నీకు డబ్బు సహాయం చేసామని సరే అంటుంది సౌమ్య.
 రాజు ఇంటికి దిగాలుగా వస్తాడు వచ్చి అక్క మీద పడి మస్తు ఏడుస్తాడు అక్క నాన్నను ఎలా రక్షించుకుందాం. అమ్మ చెప్పిన మాట నాన్న చెప్పిన మాట నేను వినలేదు ఇప్పుడు ఇంత కష్టం వచ్చింది నన్ను ఎవ్వరు కూడా నమ్మడం లేదు నేనేం చేయాలని చాలా ఏడుస్తాడు సౌమ్య కూడా బాధనిపిస్తుంది చూశావా పెద్దవాళ్ళు చెప్పిన మాట వినక లేదు ఉపాధ్యాయులు చెప్పిన మాట వినలేదు నీ మంచి నీ మంచి స్నేహితుడు చెప్పిన మాట వినలేదు. దీనివల్ల నువ్వు జీవితాన్నే కోల్పోయిన నమ్మకం కోల్పోతే జీవితంలో అన్నీ కోల్పోయినట్టే తమ్ముడు అందుకే పద్ధతిగా పెరగాలి పద్ధతిగా ఉండాలి పెద్ద వాళ్ళు చెప్పిన మాట వినాలి అని చెప్తూ ఉంటారు. ఏదో విధమైన ప్రయత్నం చేసి నాన్నగారికి అయితే ఆపరేషన్ చేపిద్దాం. చూద్దాం నువ్వు ఇప్పటికైనా మారు అంటుంది సౌమ్య. నేను మారినా నమ్మట్లేదు అక్క అని చెప్పింది ఎత్తి కొట్టుకొని ఏడుస్తాడు.
 సరే మొదలు నాన్నకు డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ చేపిస్తుంది అప్పుడు రాజు ప్రతిరోజు తండ్రికి దగ్గర ఉండి సేవ చేస్తాడు తల్లిని ఓపికగా తీసుకువెళ్తాడు తల్లితండ్రులు అవసరాలను తీరుస్తాడు అక్క అవసరాలు కూడా తీరుస్తాడు అందరు కూడా ఆసుపత్రిలో రాజును బాగా సేవ చేస్తున్నాడు అని చెప్పేసి మెచ్చుకుంటారు. అప్పుడు రాజుకు తెలుస్తుంది మంచితనంలో ఎంత ఆనందం ఉంది చెడుతనంలో ఎంత అసహ్యంగా ఉంది అనేది గ్రహించినటువంటి రాజు జీవితంలో ఎప్పుడు కూడా మంచితనం ఉండాలని అనుకుంటాడు తండ్రి ఆరోగ్యం బాగై తల్లిని తండ్రిని ఇంటికి తీసుకొని వచ్చి అందరూ హాయిగా ఉంటారు 
 చెడు ప్రవర్తనతో నమ్మకాన్ని కోల్పోతే జీవితంలో కోలుకోలేరు నమ్మకమే మనిషికి వరం లాంటిది
కామెంట్‌లు