ఖమ్మం దగ్గర ఉన్న జల్లిపల్లి అనే ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. . అతనికి మూడెకరాల పొలం మాత్రమే ఉంది వ్యవసాయం చేసుకొని బ్రతుకుతూ ఉండేవాడు కానీ వ్యవసాయదారుడు అంటే చాలా బాధనిపించేదాయనకు ఎందుకంటే ఎందుకంటే వర్షాల కొరకు ఎదురు చూడాలి దుక్కి దున్నాలి చదును చేయాలి నారు వెయ్యాలి తర్వాత నీళ్లు పెట్టాలి మందులు చల్లాలి కలుపు మొక్కలను తీయాలి చీడపీడలు పట్టకుండా చూడాలి పిట్టలు అవి తినకుండా కూడా చూడాలి తుఫాను బాధలు ఏవి రాకుండా ఉంటే అప్పుడు రైతుకు పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది అని ఇలా ఎప్పుడూ ఆలోచించేవాడు రాము అయినా తనకున్న పొలాన్ని చదును చేసి పంటలు పండిస్తున్నారు మందుల కొరకు అప్పులు చేస్తున్నాడు వచ్చిన పంట పైన అప్పులు తీరుస్తున్నాడు.
ఒకసారి రాము పంట బాగా వేశాడు చాలా సంతృప్తిగా వచ్చింది ఈసారి అన్ని అప్పులన్నీ తీరి తన గుడిసెను బాగు చేసుకుని ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. రమా కూడా పంటను చూసి చాలా సంతోషపడుతుంది తను కూడా కూలినాలి చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఈ సంతోషంలో ఇద్దరు ఉండగా ఒకరోజు రాత్రి అడవి పందులు వచ్చేసి పంట మొత్తాన్ని తొక్కి తిని పాడు చేశాయి ఎకరం నర పొలం వరకు పాడు చేశాయి అయ్యో ఈసారి తుఫాన్ లేదు పంట బాగుంది అనుకుంటే ఈ పెద్ద ప్రమాదం వచ్చిందని ఇద్దరు నెత్తిన నోరు కొట్టుకుంటూ ఏడ్చారు. పక్కకు ఉన్నటువంటి సోమయ్య భూమయ్య నీకు వచ్చినా అది పెద్ద కష్టం కాకపోతే ఉన్న పొలంలో ఉన్న పంటను బాగా చూసుకోమని చెప్తాడు. రాముకి ఇంకా పిల్లలు లేరు పక్కన ఉన్నటువంటి ఆ భూమయ్య కొడుకుని చక్కగా చూసుకుంటూ ఉంటారు. మందులు వేసి జాగ్రత్తగా కాపాడుకుంటాడు వచ్చిన పంటను అమ్మి కొంత అప్పులు తీరుస్తాడు అప్పుల వాళ్ళు మిగతా డబ్బు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అడిగితే మిగతా మళ్ళీ పంటలో కట్టేస్తానని చెప్తారు రమా కూడా కూలికి వెళ్ళిన డబ్బులతో కొంత అప్పును తీరుస్తుంది.
మిగిలిన డబ్బును కాస్త సామాను తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నోడు వాయిదా వేసుకుని ఉన్న తన చిన్న గుడిసె ని సదురుకొని ఉంటాడు ఈ వ్యవసాయదారుడు కి ఎప్పుడు కష్టాలేనా పండించిన పంటను తినే భాగ్యం లేదు అని వెత చెందుతాడు భార్య రమ ఓదారుస్తుంది కొన్ని రోజులకు కుమారుడు కలుగుతాడు కష్టాలు సుఖాలతో జీవితాన్ని వెల్లదిస్తుంటారు.
రైతుకు నిరంతరం కష్టమే రైతు వెతను తీర్చే వారు ఎవరూ లేరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి