పర్యావరణం పై బాల్యం లోనే అవగాహన పెంచాలి : శ్రీ రామకృష్ణ సేవాసమితి ప్రోగ్రాం కన్వీనర్ KVM వెంకట్

 ​వికారాబాద్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం, మంబాపూర్ గ్రామంలోని శ్రీ శారద విద్యా మందిర్ పాఠశాల ప్రాంగణంలో పర్యావరణ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు రామకృష్ణ సేవా సమితి ప్రోగ్రామ్ కన్వీనర్ KVM వెంకట్ ముఖ్య అతిథిగా  హాజరయ్యారు పాఠశాల కరస్పాండెంట్ సంతోష, KVM వెంకట్ మరియు విద్యార్థులు కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.​కార్యక్రమంలో పాల్గొన్న KVM వెంకట్ మాట్లాడుతూ, "పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. బాల్య దశ నుండి నుంచే పర్యావరణం పట్ల ప్రేమను కలిగి ఉండటం, ప్రకృతిని గౌరవించడం భారతీయుల సంస్కృతి. విద్యార్థులు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, భూమిని కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" అని పిలుపునిచ్చారు.​సర్టిఫికెట్ల ప్రదానం​ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణం పట్ల విద్యార్థుల్లో చైతన్యం నింపారు. ఇందులో భాగంగా సుమారు 40 మంది విద్యార్థులకు   సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శారద విద్యా మందిర్ ప్రిన్సిపల్ సంతోష పాఠశాల  విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కామెంట్‌లు