అచ్చులు నేర్చుకో: - N.మాధవీ లత-తెలుగు భాషోపాధ్యాయులు-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు బెజ్జంకి -9441744333.


బాల లార రాండి రా
బడి యంటే భయ మెలరా
అక్షరాలు నేర్వరా
అమ్మ మాట వినరా 
ఆట లన్ని ఆడరా 
ఇల్లు  ఈగ  రాయరా
ఉడుత ఊయల అనురా
ఋతువులు  ఋషుల గురించి నేర్చుకో
ఋూకములు ఖర్చు చేయకు
ఎలుక ఏనుగు ఐదు లెక్కించు
ఒకటి ఓడ  పలకరా 
ఔదల వంచి నమస్కరించు
అందముగా మాటలాడు 
అహ మును వీడి నడుచుకో
అచ్చులను గుర్తించు విజ్ఞులుగా మారుము
అందమైన బడిలోన 
ఎగిరే సీతాకోక చిలకలూ
రండి రండి రండిరా 

కామెంట్‌లు