అడవి ఒకటి ఉండెను
అడవిలోని చెట్టుపైన
కాకి గూడు ఉండెను
గూటిలోన గుడ్లు పెట్టి
కాగిపొదుగుచుండెను
చెట్లు నరికె మనిషి ఒకడు
గొడ్డలితో వచ్చెను
చెట్టు నరుకుచుండ కాకి
వానినేమో చూచెను
కాకికపుడు కోపమొచ్చి
తోటి కాకుల పిలిచెను
ఒక్కసారి కాకి గుంపు
మనిషినేమొ పొడిచెను
నొప్పి బాధ తాళలేక
గొడ్డలి పడవేసెను
ఏమి జరుగుచున్నదని
చెట్టు పైకి చూసెను
కాకుల గుంపు ఐక్యంగ
గూడు చుట్టు మూగెను
కొమ్మ పైన కాకి యపుడు
గుడ్ల పైన పొదిగెను
చెట్టు నరికె మనిషికేమొ
చేసిన తప్పు తెలిసెను
చెట్లను ఇంకెప్పుడు
నరకనాని ఒట్టు వేసె
ఇంటి ముఖం పట్టెను
ఊరంతా తెలిపెను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి