శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 137
 



వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
115. భద్రప్రియా (చతురక్షరీ)
116. భద్రమూర్తి (చతురక్షరీ)
నూట పదహారవ నామ మంత్రము:
ఓం భద్రమూర్త్యై నమః
భద్ర = మంగళమైన / మంగళప్రదమగు, మూర్తి = స్వరూపము గలది / మూర్తి కలది
పసుపు, కుంకుమ, గాజులు, పుష్పములు, శుభాన్ని సూచించే అన్ని ఆభరాణాలు తానే అయి, సహస్రారము మధ్యలో శంకరుని చేరి, అన్ని విధాలైన మంగళములకూ మంగళమును చేకూర్చే మంగళకరమైనదిగా, తానే శుభ మంగళ మూర్తిగా దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భద్రమూర్తీ" అని పిలిచి కీర్తించారు. అన్ని మంగళములకూ, మంగళమును చేకూర్చే పరమేశ్వరికి నమస్కారము.
బ్రహ్మమే మంగళము" అని దైవీ వాక్కు. బ్రహ్మమును మంచిన మంగళకరమైన పదార్ధాము, ఈ చరాచర జగత్తులో లేదు, కనబడదు కూడా. అటువంటి అన్ని బ్రహ్మములకు, మంగళమును ప్రసాదిస్తుంది, కనుక పరమేశ్వరి "భద్రమూర్తి" అయ్యింది.
 జీవులు చరించే ఈ చరాచర జగత్తులో, జీవుడికి ఒకసారి మంగళము / శుభము కలిగినా కూడా, ఇది సత్యమైనది కాదు. నిత్యమూ ఉండదు. మళ్ళీ మంగళము కోసం అన్వేషిస్తూ జీవుడు ప్రయాణించవలసిందే. కానీ, ఒక్కసారి, బ్రహ్మములకే బ్రహ్మమైన పరమేశ్వరి మనలను అనుగ్రహించి, అక్కున చేర్చుకుంటే, అదే పరము, పరబ్రహ్మము, నిత్యమూ, శాశ్వతము. ఆ విధంగా, శ్రీవిద్యోపాసకులైన సాధకులకు, నిత్యమైన పరమును ఇచ్చే అమ్మ, "భద్రమూర్తి".
ఈ బ్రహ్మమే తానైన పరమేశ్వరి యొక్క అనుగ్రహం పొందిన సాధకులకు, అమంగళములు, అశుభములు జరగవు. దగ్గరకు కూడా రావు. జగన్మాత, ముత్యములు, పగడములు, శంఖము, శివలింగాలలో "భద్రమూర్తి" గా ఉంటుంది, అని వేద వాక్కు. వివాహిత అయిన స్త్రీమూర్తి నుదిటిపై పాపిటి మొదలులో కూడా, పరమేశ్వరి స్థిరంగా "భద్రమూర్తి" గా ఉంటుంది. ఈ కారణం చేతనే, వివాహమైన స్త్రీలు పాపిటలో కుంకుమ ధరిస్తారు. ఐదు మంగళకర వస్తువులు అయిన, పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మంగళసూత్రం వీటిలో పరమేశ్వరి "మంగళగౌరి దేవత" గా ఉంటుంది.
ఈ జగత్తులో మంగళాన్ని కలిగించే, సూచించే అన్ని వస్తువులులలో  "భద్రమూర్తి" గా ఉంటూ, మనతో నిత్యమూ సహచరిగా ప్రయాణం చేస్తూ, మనకు శుభాలను మాత్రమే ఇచ్చి, అంత్య కాలములో మనలను తనలో కలుపుకోడానికి, మనతో కలిసి అడుగులో అడుగు కలుపుతున్న పరదేవతను, పరమగురువు, సద్గురువు అనుగ్రహం తో గుర్తించి, గట్టిగా పట్టుకుని వుండే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భద్రమూర్త్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
పద్య లక్షణాలు-ఉత్పలమాల,రుద్రవరం శివకుమార్,10వ తరగతి,జి.ప.ఉ.పా.వావిలాల, కరీంనగర్
చిత్రం