సుమంత్రుడు శ్రీరాముని మందిరమును ప్రవేశించుట
----------------
వేదపారాంగతులైన బ్రాహ్మణులు
రాజవంశ పురోహితుడైన వసిష్టునితో
పట్టాభిషేక మండపమునకు చేరినారు
ఆచటికి రాజులు, ప్రజలు వచ్చారు
సుమంత్రుడు దశరథ గృహము నుండి
రాముని వద్దకు బయలుదేరినాడు
అతడు వెళ్లే దారిలో వీధులన్నీ
పచ్చని తోరణాలతో అందంగున్నాయి
కైలాసశిఖరము వలె కాంతులిడుచున్న
ఇంద్ర భవనముల వలె శోభితమైన
అతి మనోహరముగానున్న
శ్రీరాముని అతఃపురము దర్శించెను
ఆ భవనమునకు గొప్ప ద్వారములను
బంగారు తోరణాలు అలంకరించారు
చందనమాలలతో దీప ధూపాలతో
అన్నిదిశల సుగందాలను విరజిల్లుచున్నది
శ్రీరాముని అంతఃపురము చూడగా
పెక్కు భవనములతో గూడియున్నది
నిశ్చలమైన మేఘములాయున్నది
సుమంత్రుడు లోనికి ప్రవేశించాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి