శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట
--------------------------
కాషాయ వస్త్రములలో ద్వార పాలకులు
అతనికి గౌరవముగా నమస్కరించినారు
సుమంత్రుడు ప్రతి నమస్కారం చేశాడు
ద్వారపాలకులు రాముని చెంతకేగి
సుమంత్రుని రాక గూర్చి తెలిపినారు
అతడిని రాముడు లోనికి రప్పించినాడు
చక్కని వస్త్రాభరణం ధరించి యున్న
సీతారాములను సుమంత్రుడు కళ్ళజూసి
గౌరవముగా వందనము లొనర్చెను
కౌసల్యా దేవి పుత్రుడా ఓ రామ
తండ్రి దశరథుడు తల్లి కైకేయితో గూడి
మిమ్ములను చూడగోరుచున్నారు
ఆలసింపక త్వరగా వెళ్ళుదాము
సుమంత్రుని మాటలువిని సంతోషమున
శ్రీరాముడు సీతతో ఇలా అంటాడు
మా తండ్రియు కైకేయిమాతయు
నన్ను రమ్మని కబురు పంపినారు
సర్వసమర్ధురాలైన కైకేయి తల్లి
సదావేళలో నా హితవును కోరుతుంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి