శ్రీరాముడు తన తండ్రి దశరథుని దైన్యస్థితికి కారణమడుగుట
-------------------
అతని పక్కనే కైకేయి నిలబడి యున్నది
శ్రీరాముడు తండ్రిని చూడగానే
అతనికి పాదాభివందనము చేసినాడు
దశరథమహారాజు శ్రీరాముని చూడగానే
తండ్రీ ! రామా! అని ప్రేమతో పిలిచెను
ఆయన కళ్ళు అశ్రుపూరితములయ్యెను
పిదప దశరథిని గొంతు పెకల లేదు
దశరథుని ముఖము చూడగానే
శ్రీరాముడు దిగ్భ్రాంతికి లోనైనాడు
దశరథుని ముఖములో సంతోషము లేదు
తండ్రి శోకపరితాపముతో నిండియుండెను.
రాముడు పెక్కుదుక్కముతో పరితపిస్తూ
ముఖ కాంతిని కోల్పోయిన రాముడు
కైకేయికి నమస్కరించి ఇలా అడుగుతాడు
మా తండ్రి బాధలో యున్నాడెందుకు?
నా వలన ఏదైన అపరాధము జరిగెనా
దయతో నీవు నాకు తెలుపుము తల్లీ
ఎల్లప్పుడు నాపై ప్రేమను చూపేవాడు
ఇప్పుడు చిన్నబోవుటకు గల కారణమేమి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి