శ్రీరాముని వనగమనమునకై కైకేయి తొందర పెట్టుట
రాముడు కైకేయి చెప్పిన మాటలు విని
ఏమాత్రము బాధపడకుండా నిశ్చలనముగా
తండ్రికి, కైకేయికి వందనములొనర్చి
తండ్రిని కోపగించకుమని కైకతో అంటాడు
భరతుని పట్టాభిషేకము గూర్చి తండ్రి
నాతో ఒక చిన్న మాట కూడా తెలుపలేదు
భరతుడంటే నాకు మిక్కిలి ఇష్టము
!ఓ రామా! నీవిచట నుండి తొందరగా వెళ్లుము
నేను వెళ్లి భరతుని తీసుకొని వచ్చెదనమ్మా
దగ్గర ఉండి పట్టాభిషేకం చేయిస్తాను
మంత్రులు భరతుని చెంతకు వెళ్ళినారు
భరతుడు వచ్చేసరికి నీవు వెళ్లిపొమ్ము
తండ్రికి మరొకసారి నమస్కరించి వెళ్తాను
ఓ వరశ్రేష్ట! రాజు నీతో మాట్లాడుటకు
సిగ్గు పడుచున్నాడు నీవు వెళ్ళుము
నీ మనస్సున విచారమును తొలగించు
నీవు వనమునకు వెళ్లనంతవరకు
అతడన్నపానీయములు ముట్టడు
దశరథుడు కైక మాటలు విని మూర్ఛిల్లి
సింహాసనంపై నుండి పడిపోయినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి