ఆంధ్రమహిళాసభలు 1930తో మొదలై 11వ సభదాకా: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ


 డా.కె.జానకిగారిRoleof women in freedom struggle in Andhra Pradesh
1930లో మాడపాటి హనుమంతరావుగారు ఆంధ్ర ఉమెన్స్ కాన్ఫరెన్స్ ని ఆంధ్రా మూవ్ మెంట్  కై నడిపారు.తెలుగు భాష సంస్కృతికి నడుంబిగించారాయన.1930లో జోగిపేటలో జరిగింది.నడింపల్లిసుందరమ్మ ,డాక్టర్ చంద్రమతీదేవి ఆ కాన్ఫరెన్స్ లకు అధ్యక్షత వహించారు. బాల్యవివాహాలు, స్త్రీజనోద్ధరణ, వితంతు వేశ్యలసమస్యలను గూర్చి చర్చించారు.1931లో దేవరకొండ లో జరిగిన సమావేశానికి టి.వరలక్ష్మమ్మ, సత్యవతీబాయి ముఖ్య పాత్ర పోషించారు.స్త్రీవిద్య ,నిర్బంధ  ఉచిత  ప్రైమరీ విద్య మాతృభాష లో జరగాలని,పర్దా పద్ధతికి స్వస్తిచెప్పాలనితీర్మానించారు.మాడపాటి మాణిక్యమ్మ,  సంగం వెంకట రమణమ్మ, గాడేపల్లి సత్యవతీదేవి పాల్గొన్నారు.1934లో ఖమ్మంలో ఎల్లాప్రగడ సీతాకుమారి,చైరాతి లక్ష్మీనరసమ్మ  ఖమ్మం గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్ హెచ్.ఎం. ముఖ్య భూమిక పోషించారు.2వేల మంది మహిళలు హాజరైనారు. 4వ ఆంధ్ర మహిళాసభ  1935లో  సిరిసిల్ల లో జోగితెపల్లి రాధాబాయమ్మ,మాడపాటి మాణిక్యాంబ హాజరైనారు.ఆదంపతుల ఫోటోలు లాకెట్స్ లో అమర్చి అమ్మితే హాట్ కాక్స్ లా అమ్ముడైనాయి. సికింద్రాబాద్ కిచెందిన శ్యాంరావుగారికే ఆఖ్యాతి దక్కుతుంది.తొలిసారి రకరకాల పోటీలు జిమ్నాస్టిక్స్ లో జరిగి  ఆడపిల్లలే పైచేయిగా నిలిచారు. లాల్ దర్వాజా గరల్స్ స్కూల్,  గజాననవ్యాయామశాల జిమ్నాస్టిక్స్ ప్రదర్శన అలరించింది.1936లో షాద్ నగర్ లో 5వ కాన్ఫరెన్స్  బూర్గుల అనంత లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగింది.ఆరవ కాన్ఫరెన్స్ 1937లో నిజామాబాదులో జరిగింది నందగిరి ఇందిరా దేవి ముఖ్య అతిథి ఏడవ కాన్ఫరెన్స్ మల్కాపురం లో 1938 లో యోగ్యసీలాదేవి అధ్యక్షతన జరిగింది బాలవివాహాలు నిరోధించాలని తీర్మానించారు ఎనిమిదవది చిలుకూరు లో 1941లో రంగమ్మ ఓబులరెడ్డి అధ్యక్షతన జరిగింది ఆమె తెలుగు ఉర్దూ ఇంగ్లీషులో పండితురాలు 9వది 1942లో ధర్మవరంలో జరిగింది పదవది హైదరాబాదులో 1943లో జరిగింది పాల్వంచ సంస్థానం మహారాణి హాజరైంది ఆమె పేరు అలివేలు మంగతాయారమ్మ 11వ సభ భువనగిరిలో నిమ్మగడ్డ సత్యవతి దేవి ఆధ్వర్యంలో జరిగింది 🌹
కామెంట్‌లు
Popular posts